ఇటీవల అనిల్ రావిపూడి(Anil Ravipudi) నెక్స్ట్ సినిమా గురించి ఓ అధికారిక ప్రకటన వచ్చింది. అనిల్.. నెక్స్ట్ సినిమా విక్టరీ వెంకటేష్‌తోనే చేస్తారని చాలా కాలంగా టాక్ నడుస్తుంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత అనిల్ తో సినిమా చేయబోతున్నట్టు స్వయంగా రివీల్ చేశారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో మరో హీరో కూడా ఉంటాడని కొన్నాళ్లుగా వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో కార్తీ, ఫహద్ ఫాజిల్ వంటి పరభాషా హీరోలతో పాటు సాయి ధరమ్ తేజ్ పేరు కూడా వినిపించింది.
అయితే ఆ ఊహాగానాలని తలక్రిందులు చేస్తూ నందమూరి కళ్యాణ్ రామ్ ని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకొచ్చాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడికి ‘పటాస్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో లైఫ్ ఇచ్చింది కళ్యాణ్ రామ్. ఆ సినిమా తర్వాత అనిల్.. తన కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం తెచ్చుకోలేదు. సినిమా సినిమాకి అనిల్ స్థాయి పెరుగుతూనే వచ్చింది. అయితే నందమూరి అభిమానులు కళ్యాణ్ రామ్ తో నెక్స్ట్ సినిమా ఎప్పుడు? అంటూ ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు.
అనిల్ కూడా కళ్యాణ్ రామ్ కి ఓ సినిమా చేసి అతని రుణం తీర్చుకోవాలని చెబుతూనే వచ్చాడు. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ప్రమోషన్స్ లో కూడా అనిల్ పాల్గొని ఈ విషయం చెప్పడం జరిగింది.మొత్తానికి ఈ కాంబో సెట్ అయ్యింది. కానీ నిర్మాత ఎవరు? హీరోయిన్లు ఎవరు? అనే విషయాల పై స్పష్టత రాలేదు. ఇన్శైడ్ టాక్ ప్రకారం.. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ తరహాలో ‘తోడల్లుళ్ల’ కథలా ఉంటుందని కొంతమంది చెప్పుకొచ్చారు.
కానీ ఇంకొంత మంది బావాబావమరుదుల కథ అని అంటున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఫన్ కూడా ఉంటుందని అనిల్ చెప్పడం జరిగింది. అయితే కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చాక కథ, కథనాలు మారినట్టు తెలుస్తుంది.వెంకీ కంటే కళ్యాణ్ రామ్ రేంజ్ కొంచెం తక్కువ. అలా అని కళ్యాణ్ రామ్ ని తక్కువ చేస్తూ కథనం నడిపించడానికి అనిల్ ఇష్టపడదు. అందుకే అదే కథపై రీ-వర్క్ చేస్తున్నట్టు టాక్.