వెంకటేష్(Venkatesh) ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఓ పక్క వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఆయన నుండి ఆశించే కామిడీ ఎంటర్టైనర్లు మిస్ చేయడం లేదు. వెంకీ అలాంటి సినిమాలు చేస్తే తిరుగుండదు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే క్రైమ్ కామిడీ సినిమా చేస్తున్న వెంకీ ఆ వెంటనే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ చేయబోతున్నాడు.
ఈ 2 సినిమాల పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హిట్ అయితే ఇవి భారీ లాభాలు అందించడం ఖాయం. అయితే వెంకటేష్ కోసం మరో కామిడీ డైరెక్టర్ కూడా ఆసక్తికర కథ రాసుకున్నాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు అనుదీప్ కేవీ. ‘పిట్టగోడ’ ‘జాతిరత్నాలు’ ‘ప్రిన్స్’ సినిమాలు తీశాడు. వీటిలో ‘జాతి రత్నాలు’ బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదటి సినిమా ‘పిట్టగోడ’ ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అసలు ఆ సినిమా ఏ ప్లాట్ ఫామ్లోనూ అందుబాటులో లేదు.
ఇక శివకార్తికేయన్ తో అనుదీప్ చేసిన ‘ప్రిన్స్’ పెద్ద డిజాస్టర్ అయ్యింది.అయినప్పటికీ అనుదీప్ సినిమాల్లో కామిడీని ఇష్టపడే జనాలు ఉన్నారు. మరో 2 రోజుల్లో ‘ఫంకీ’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇది హిట్ అయితే అనుదీప్ ఫామ్లోకి వచ్చినట్టే. అయితే మరోపక్క.. అనుదీప్ కేవీ వెంకటేష్ కోసం ఓ హిలెరియస్ ఎంటెర్టైనర్ డిజైన్ చేసుకున్నాడట. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయి.
వెంకటేష్ ని ఇదివరకే కలిసి లైన్ వినిపించాడు అనుదీప్. వెంకటేష్ కి కూడా ఫార్మల్ వేలో బాగుంది అని చెప్పడం జరిగింది. ఫైనల్ నెరేషన్ విని వెంకటేష్ ఓకే చెబితే.. ‘సితార ఎంటర్టైన్మెంట్’ బ్యానర్లో నాగవంశీ నిర్మించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.