Venkatesh: కూతుర్ని ప్రేమించిన యంగ్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన వెంకటేష్!

  • October 4, 2023 / 05:03 PM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ వచ్చే హీరోలలో ఒకడు విక్టరీ వెంకటేష్. ఎన్నో దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కొనసాగుతున్న వెంకటేష్ పై ఇప్పట్టి వరకు ఒక్క రూమర్ కూడా రాలేదు. వచ్చినా ఆ రూమర్స్ నిలిచేవి కాదు. అలాంటి క్యారక్టర్ ఆయన సొంతం. అంతే కాకుండా వెంకటేష్ తన కుటుంబ సభ్యులను పార్టీలకు కానీ, పెళ్లిళ్లకు కానీ తీసుకొని రావడం అనేది చాలా అరుదు.

అంత ప్రైవసీ పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు ఆయన. ఆయనకీ ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇద్దరు కూతుర్లకు పెళ్లిళ్లు చేసేసాడు. వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటారు. రెండవ కూతురు ఆశ్రిత ఇంస్టాగ్రామ్ లో ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించి ఫోటోలు మరియు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇక చిన్న కూతురు హయవాహిని దగ్గుపాటి మాత్రం సోషల్ మీడియా లో లేదు.

ఈమెని బయట కూడా చాలా తక్కువ సందర్భాలలో మనం చూసి ఉంటాము. అయితే ఈమెని ఒక ప్రముఖ యంగ్ హీరో ప్రేమిస్తున్నాను అంటూ గత కొంతకాలం నుండి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని తెగ వేధిస్తున్నాడు అట. ఎన్ని విధాలుగా నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పినా కూడా శాడిస్ట్ లాగ ప్రవర్తిస్తూ ఆమె చుట్టూనే తిరుగుతున్నాడు అట.

చాలా కాలం వరకు ఈ విషయాన్నీ తన మనసులోనే దాచుకొని, అతని వేషాలను భరించిన హయవాహిని, రీసెంట్ గా వెంకటేష్ కి చెప్పి ఏడ్చిందట. దీంతో వెంకటేష్ ఆ యంగ్ హీరో ని ఇంటికి పిలిపించి సీరియస్ వార్నింగ్ ఇచ్చి బయటకు పంపాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఆ కుర్ర హీరో దగ్గుపాటి రానా కి క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకడు అట.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus