ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు : సురేష్ ప్రొడక్షన్స్

విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘విక్రమ్ వేధా’. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని గత కొంత కాలంగా టాక్ నడుస్తుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం కనెక్ట్ అవుతుందని త్వరలోనే రీమేక్ చేయబోతున్నారని టాక్ వచ్చింది. ఇక తాజాగా వెంకటేష్,నారా రోహిత్ ల తో ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ స్క్రిప్ట్ పనుల మీదే వినాయక్ బిజీగా గడుపుతున్నాడని సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడని కూడా టాక్ నడిచింది.

అయితే ఈ విషయం పై ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ‘వెంకటేష్ ‘విక్రమ్ వేధా’ రీమేక్ లో నటించబోతున్నట్టు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం ఆయన ‘వెంకీ మామ’ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఇక తన తరువాత చేయబోయే సినిమా గురించి మేమే స్వయంగా తెలియజేస్తాం. దయచేసి ఇలాంటి వార్తల్ని ప్రచారం చేయకండి’ అంటూ వారు క్లారిటీ ఇచ్చారు. ఇక నాగచైతన్య తో కలిసి వెంకటేష్ నటిస్తున్న ‘వెంకీమామ’ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus