తెలుగు దర్శకుడు ఇతర భాషలకు వెళ్లి.. అక్కడి హీరోలతో సినిమాలు చేయడం గొప్పే. కానీ తెలుగు హీరోలతో సినిమాలు చేయకుండా.. ఇతర భాషలకు వెళ్లడం మన అభిమానులకు నచ్చదు. అలా ఎలా తీస్తారు అనే ప్రశ్న వస్తుంది. అందులోనూ అలా చేసిన సినిమాలు భారీ విజయాలు అందుకుంటే ఇంకా బాధ అనిపిస్తుంది. ఇదే విషయంలో ఇప్పుడు వెంకీ అట్లూరి విషయంలో ఇదే ప్రశ్న ఎదురవుతోంది. గత మూడు సినిమాలు ఆయన నాన్ తెలుగు హీరోలతోనే చేశారు.
ఇదంతా చదివి మీరు ‘అంతా ఒకటే కదా.. అంతా ఇండియన్ సినిమానే కదా’ అనొచ్చు. మీరన్నది కరెక్టే. కానీ ఆ కథలు, ఆ విజయాలు మన హీరోలకు పడితే ఇంకా బాగుండేది కాబట్టి. ఇక ఈ మాటకు ఆయన సమాధానం చూస్తే.. నిజమే కదా అనిపిస్తోంది. అంతకంటే ముందు రీసెంట్‌గా వెంకీ అట్లూరి చేసిన సినిమాలు చూద్దాం. రీసెంట్ సినిమా సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే సినిమా తీశారు. ఆ సినిమాకు ముందు దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా చేశారు. దానికి ముందు ధనుష్‌తో ‘సార్’ సినిమా చేశారు.
ఈ క్రమంలో కొంతమంది ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాను కథను తెలుగు హీరోలు రిజెక్ట్ చేశారు అనే కామెంట్ కూడా వినిపించింది. దీనికి వెంకీ అట్లూరి స్పందిస్తూ.. ఈ సినిమా పూర్తి కథను తెలుగు హీరోలు ఎవరికీ చెప్పలేదు. 2020 – 2022 మధ్యలో అంటే కరోనా – లాక్‌డౌన్ టైమ్‌లో ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది. ఆ సమయంలో ఎవరూ కొత్త సినిమాలు ప్రారంభించే పరస్థితి లేదు. ఒకవేళ సినిమాలు చేస్తున్నా గతంలో మొదలు పెట్టిన, ఓకే అనుకున్న సినిమాలే చేస్తున్నారు అంటూ నాటి రోజుల గురించి చెప్పారు.
అక్కడికికి కొద్ది రోజులకు షూటింగ్స్ ప్రారంభించాక తాను కాంటాక్ట్ అయినవారు పాత సినిమాలతోనే బిజీగా ఉన్నారు. దీంతో ధనుష్, దుల్కర్ సల్మాన్‌కు కథలు చెప్పాను. ఆ సినిమాల తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథ సూర్యకు చెప్పాను. ఆయన క్లైమాక్స్ విషయంలో జాగ్రత్తగా తీయాలని చెప్పారు అంటూ క్లారిటీ ఇచ్చారు.