Venu Swamy: బాలారిష్టాలు ఉంటే ఆ పని చేయకూడదు.. వేణుస్వామి ఏమన్నారంటే?

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జ్యోతిష్కుడు వేణుస్వామి వార్తల్లో నిలుస్తున్నారు. హిట్ సినిమాలలోని డైలాగ్స్ కు రీల్స్ కూడా చేస్తున్న వేణుస్వామి తనపై ఎవరైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలకు సైతం తనదైన శైలిలో సమాధానం చెబుతుండటం గమనార్హం. క్లీంకార పుట్టిన కొన్ని గంటల తర్వాత వేణుస్వామి క్లీంకార జాతకం గురించి పాజిటివ్ గానే చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో అప్పుడే పుట్టిన చిన్నారి జాతకం చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

పిల్లలకు బాలారిష్టం ఉంటే మాత్రమే వాళ్ల జాతకాలు చెప్పకూడదని బాలారిష్టాలు లేని జాతకాలను చెప్పవచ్చని వేణుస్వామి వెల్లడించారు. ఒకవేళ బాలారిష్టం ఉన్న వాళ్ల జాతకం చెబితే మాత్రం జాతకంలో ఉన్న దోషాల గురించి చెప్పవచ్చని వేణుస్వామి పేర్కొన్నారు. అన్నీ బాగున్న పిల్లలకు జాతకాలు చెప్పవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. తాను క్లీంకార జాతకం చెప్పడం వెనుక అసలు కారణాలు ఇవేనని వేణుస్వామి పేర్కొన్నారు.

వేణుస్వామి క్లారిటీతో నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లు సైలెంట్ అవుతారేమో చూడాల్సి ఉంది. క్లీంకార జాతకం అద్భుతంగా ఉందని భవిష్యత్తులో క్లీంకార తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటుందని వేణుస్వామి గతంలో వెల్లడించారు. చరణ్ (Ram Charan) ఉపాసన దంపతులకు ఒక్కరే సంతానం అని వేణుస్వామి పేర్కొన్నారు. వేణుస్వామి ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో కూడా చెబుతున్నారు.

ఆయన చెబుతున్న విషయాలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు చరణ్ తాజాగా వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసిన సంగతి తెలిసిందే. చరణ్ కు డాక్టరేట్ రావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. చరణ్ కు గేమ్ ఛేంజర్ (Game changer) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సైతం దక్కుతుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ ఇకపై వేగంగా సినిమాలలో నటించేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus