Venu Swamy: వేణుస్వామి గురించి ప్రభాస్ అలా రియాక్ట్ అయ్యారా.. ఏం జరిగిందంటే?

  • April 13, 2024 / 06:32 PM IST

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఆ ఇంటర్వ్యూలో చెప్పే విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంటాయి. సెలబ్రిటీల జాతకాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వేణుస్వామిని అభిమానించే వాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో విమర్శించే వాళ్లు ఆ స్థాయిలో ఉన్నారు. కొన్నిరోజుల క్రితం వేణుస్వామి తన భార్యతో కలిసి మిర్చి (Mirchi) సినిమాలోని డైలాగ్స్ తో స్పూఫ్ వీడియో చేయగా ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. వైరల్ అయిన వీడియో గురించి వేణుస్వామి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తన స్పూఫ్ వీడియో గురించి ప్రభాస్ (Prabhas) స్పందించారని వీడియోలో నేను స్టైల్ గా ఉన్నానని ప్రభాస్ రియాక్ట్ అయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. తన తోటలోని సీతాఫలాలను ప్రభాస్ కు పంపించగా పండ్లు చాలా రుచిగా ఉన్నాయని కుదిరితే మళ్లీ పంపాలని ప్రభాస్ అడిగారని వేణుస్వామి పేర్కొన్నారు. వేణుస్వామి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. వేణుస్వామి చేసిన కామెంట్స్ నమ్మశక్యంగా లేవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

భవిష్యత్తు ఇంటర్వ్యూలలో ప్రభాస్ వేణుస్వామి కామెంట్ల గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ప్రభాస్ నటిస్తున్న కల్కి (Kalki) రిలీజ్ డేట్ కు సంబంధించి ఈ నెల 17వ తేదీన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కల్కి సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమా మెమరబుల్ మూవీగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

వరుసగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ భారీ విజయాలను అందుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. కల్కి 2898 ఏడీ పాన్ ఇండియా మూవీగా దేశ, విదేశీ భాషల్లో విడుదల కానుంది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) మహానటి సినిమా తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus