రూమర్లను కొట్టిపడేసిన రవితేజ డైరక్టర్

  • June 27, 2018 / 10:38 AM IST

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో  “అమర్‌ అక్బర్‌ ఆంటోనీ” సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ఇలియానా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ దసరాకి రిలీజ్ కానుంది. దీని తర్వాత “ఎక్కడికి పోతావు చిన్నవాడ”  డైరక్టర్ విఐ ఆనంద్ తో సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక శర్మ ని తీసుకోమని రవితేజ చెప్పినట్లు వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. నేల టికెట్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.అందుకే మళ్ళీ ఆమె కావాలని రవితేజ కోరుకున్నట్టు ప్రచారం సాగింది.

ఈ విషయాన్నీ డైరక్టర్ విఐ ఆనంద్ ముందు ఉంచగా.. ఈ వార్తలన్నీ ఆధారం లేనివని చెప్పారు. అదంతా వట్టి పుకార్లని కొట్టిపడేశారు. “మా సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. వారిని సెలక్ట్ చేసే పనిలోనే ఉన్నాను. ఈ విషయంలో రవితేజ ఇన్వాల్మెంట్ ఏమీలేదు. స్క్రిప్ట్ కి సూటయ్యే హీరోయిన్స్ లను మాత్రమే సెలక్ట్ చేస్తాము” అని చెప్పారు. ఈ సినిమా దసరా నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో రవితేజ తండ్రి కొడుకులుగా నటించనున్నట్లు సమాచారం. మాస్ మహారాజ్ అభిమానులకు నచ్చేలా సినిమా ఉంటుందని చిత్రబృందం వెల్లడించింది.  ఈ చిత్రంతో పాటు రవితేజ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus