లేడీస్ సూపర్ స్టార్ నయనతార నేడు తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. నయనతారకు ఇది 38వ పుట్టినరోజు కావడంతో తన భర్త విగ్నేష్ శివన్ తనకు ఎంతో ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ క్రమంలోనే నయనతారకు ప్రత్యేకంగా ఈయన శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్ చేస్తూ నయనతార పట్ల తనకు ఉన్న ప్రేమను తెలియజేశారు. ఈ సందర్భంగా విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…
ఇది నాకు మీతో తొమ్మిదవ పుట్టినరోజు నయన్. ప్రతి పుట్టినరోజుకు మీరు ఎంతో విభిన్నంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు.అయితే ఈ పుట్టినరోజు మాకు ఎంతో ప్రత్యేకమైనది ఈ పుట్టినరోజుకు మనము భార్యాభర్తలుగా మారడమే కాకుండా తల్లిదండ్రులు కూడా అయ్యాము. నేను ఓ వ్యక్తిగా నీకు ఎప్పటినుంచో తెలుసు. నిన్ను ఓ శక్తివంతమైన మహిళగా చూశాను. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం పని పట్ల మీరు చూపించే శ్రద్ధ నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి.
మిమ్మల్ని చూసినప్పుడు ఎంతో ఇన్స్పిరేషన్ కలుగుతుంది. అయితే ఓ తల్లిగా మిమ్మల్ని చూసినప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. మీరు తల్లి అయినప్పుడు ఓ పరిపూర్ణమైన మహిళగా కనపడుతున్నారు. ఇప్పుడు మీరు తల్లిగా ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలు మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటున్నారని మేకప్ వేసుకోవడం కూడా మానేశారు. ఇప్పుడు మీరు మరింత అందంగా కనపడుతున్నారు.
ఇలా మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను.ఇప్పుడు, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రియమైన పొండాటి, తంగేయ్య ఎల్లప్పుడు నా ఉయిర్ అండ్ ఉలగం అంటూ ఎమోషనల్ నోట్‌ని షేర్ చేశారు.ప్రస్తుతం తన భార్య పట్ల తనకు ఉన్న ప్రేమను తెలియజేస్తూ విగ్నేష్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!