Vijay Antony: యాచకులకు 5 స్టార్ హోటల్లో బిర్యానీ ఇప్పించిన విజయ్ ఆంటోని… వీడియో వైరల్!

  • May 27, 2023 / 05:43 PM IST

‘బిచ్చగాడు’ అనే టైటిల్ సినిమాకి పెట్టుకోవాలి అంటేనే ఎవ్వరైనా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ ఆ టైటిల్ తో సినిమా తీసి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ ఆంటోని. ఆ సినిమాలో కూడా ‘మీకు ఇష్టం ఉంటే ఎంతో కొంత వేయాలి కానీ వాళ్ళని చులకన చేసి చూడకూడదు.. నోరు పారేసుకోకూడదు’ అనే మెసేజ్ కూడా ఇచ్చాడు. సినిమాల్లో ‘బిచ్చగాళ్ల’ పై జోకులు వేసుకోవడం.. వాళ్ళని జోకర్లుగా తక్కువ చేసి చూపించడం మాత్రమే అప్పటివరకు అంతా చూశారు.

కానీ (Vijay Antony) విజయ్ ఆంటోని .. ఆ సినిమాతో కొందరి మనసులనైనా మార్చాడు అని చెప్పొచ్చు. ఇక ఆ సినిమా తర్వాత విజయ్ ఆంటోని నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే ఇటీవల వచ్చిన ‘బిచ్చగాడు 2 ‘ కూడా మంచి విజయాన్ని అందుకుంది. మొదటి వారమే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ ను లాభాల బాట పట్టించింది. తమిళంలో కంటే కూడా తెలుగులోనే ఈ సినిమా బాగా కలెక్ట్ చేస్తుంది.

అందుకే ఈ చిత్రాన్ని మరింతగా ప్రమోట్ చేస్తున్నాడు విజయ్ ఆంటోని. ఇందులో భాగంగా కొన్ని పుణ్య కార్యాలు కూడా చేస్తున్నాడు. ఆల్రెడీ తిరుపతిలో ఉన్న యాచకులకు యాంటీ బికిలీ కిట్స్ అందించాడు. అలాగే మరికొంతమంది యాచకులను 5 స్టార్ హోటల్ కు తీసుకెళ్లి మరీ.. స్వయంగా తన చేతులతో బిర్యానీ వడ్డించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus