ముంబైలో విజయ్ దేవరకొండ క్రేజ్ చూశారా?

స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ముంబైలో సర్ ప్రైజ్ చేస్తోంది. అక్కడి బాలీవుడ్ స్టార్స్ కు ఏమాత్రం తగ్గని ఫాలోయింగ్ రౌడీ స్టార్ కు కనిపిస్తోంది. ఇటీవల ముంబైలోని అంధేరీ సినీపోలీస్ లో లైగర్ ట్రైలర్ విడుదల చేశారు. హైదరాబాద్ లో క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ముంబైలోనూ అంతే భారీ స్పందన రావడం ఆశ్చర్యపరుస్తోంది. కార్యక్రమం పూర్తయ్యాక కూడా ఫ్యాన్స్ విజయ్ ను ఫాలో చేస్తూనే ఉన్నారు. అభిమానులను గ్రీటింగ్ చేస్తూ తన కృతజ్ఞత తెలిపారు విజయ్. లైగర్ ఇప్పటికే టీజర్, పోస్టర్లు , ఫస్ట్ సింగిల్‌తో భారీ బజ్ ని క్రియేట్ చేయగా, ట్రైలర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయిక గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్‌పై అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

https://twitter.com/TheDeverakonda/status/1550710840021876736

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus