మీడియా పై చిరాకు పడ్డ విజయ్ దేవరకొండ..!

తాజాగా ‘టాక్సీవాలా’ చిత్రంతో మరో హిట్ అందుకున్నాడు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఎప్పుడు ఏం మాట్లాడినా అది సంచలనం అవుతుంది. తన యాటిట్యూడ్ తో కొంత నెగెటివిటీ ఉన్నప్పటికీ దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం విజయ్ స్టైల్ అని చెప్పడంలో సందేహం లేదు. అయితే తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో విజయ్ దేవరకొండ చిరాకు పడ్డాడట.

దానికి కారణం ..మీడియా వారు అడిగిన ఒక ప్రశ్న అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. మీరు రెమ్యునేషన్ పెంచేశారట కదా.. అని అడిగిన ప్రశ్నకు విజయ్ అసహనానికి గురయ్యాడట. దీని పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ …… ‘నా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండీ కంటిన్యూగా ఇదే ప్రశ్న అడుగుతున్నారు .. , కొత్త ప్రశ్నలేమీ ఉండవా..? అయినా నా రెమ్యునేషన్ పెంచితే… మీకు బాధనా లేక సంతోషమా…? మీకు పెరిగితే మీరు ఆనందపడాలి కానీ”… అంటూ విజయ్ మీడియా పై చిరాకుపడినట్టు సమాచారం.

అయితే ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ ‘టాక్సీవాలా’ చిత్రాలకు పెట్టిన డబ్బులకి నాలుగింతలు కలెక్షన్స్ సాధించి.. సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వచ్చాయి. విజయ్ కు యూత్ లో గల క్రేజ్ అలాంటిది అనడంలో సందేహం లేదు. విజయ్ చిత్రం అంటే టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ లో నే 60 శాతం వరకు కలెక్షన్లను రాబట్టేస్తున్నాయి. ‘నోటా’ లాంటి చిత్రం ప్లాప్ అయినా .. ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇలాంటి నేపథ్యంలో విజయ్ రెమ్యూనరేషన్ పెంచినా తప్పులేదంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus