విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్?

‘పెళ్ళి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ ‘టాక్సీవాలా’ చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ తో ఓ చిత్రం చేయాలని చాలా మంది డైరెక్టర్లు లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండ పేరు మారు మోగుతుందనే చెప్పాలి. కోలీవుడ్ లో ‘నోటా’ అనే చిత్రంతో కూడా ఎంట్రీ ఇచ్చాడు విజయ్.

ఇక బాలీవుడ్ లో కూడా విజయ్ ఓ చిత్రం చేయబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలన ఇప్పట్లో హిందీలో సినిమా చేయకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు నిజంగానే విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. 1983లో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా తిరుగులేని విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందీలో ‘1983’ టైటిల్ తో ఓ సినిమా రూపొందించదానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్ర కోసం ఆల్రెడీ రణ్ వీర్ సింగ్ ను ఎంపిక చేశారట. ఇక ఆ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను తీసుకున్నారని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus