మంచి పనికోసం ముందుకు వస్తున్న సినీ ప్రముఖులు

పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా మోసాలు తగ్గడం లేదు. నేరాలు ఆగడం లేదు. కిలాడీలు రోజుకో ప్లాన్ తో బురిడీ కొట్టిస్తున్నారు. అందుకే మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలని పోలీసులు కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ముందుగా హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ అంశాలపై షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు. ఇందుకు దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు తమ గాత్రాన్ని అందించారు. ఇప్పుడు క్రైమ్ పోలీసులు చేపట్టనున్న కార్యక్రమాలకు కూడా వీరిద్దరూ తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించనున్నారు.

వీరితో పాటు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ కలవనున్నారు. అతను కూడా నేరాల నిరోధానికి తనవంతు సాయం చేస్తానని మునకు వచ్చారు. ఉద్యోగావకాశాల విషయంలో జరిగే మోసాలు, క్రెడిట్ కార్డ్, ఓటీపీ, పెళ్లి ప్రకటనలు వంటి మోసపూరిత విషయాల్లో అవగాహనా కల్పించేందుకు కొన్ని కార్యక్రమాలు త్వరలో నగరంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ హాజరై అవగాహనా కల్పించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus