సినిమా విజయం సాధిస్తే.. ఆ నిర్మాతలు హీరోకు, సినిమాలో పని చేసిన కీలక నటీనటులు, టెక్నీషియన్లకు డబ్బులు, గిఫ్ట్లు ఇవ్వడం చూశాం. గత కొన్ని రోజులుగా ‘జైలర్’ టీమ్ ఇదే పని చేస్తోంది. అయితే ‘ఖుషి’ సినిమా విజయం సాధించిన సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పటికే భారతీయ సినిమా చరిత్రలో ఎవరూ చేయని విధంగా అభిమానులకు ఫ్యాన్స్కి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఖుషి’.
శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సెప్టెంబరు 1న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్తో మంచి వసూళ్లను అందుకుంది. పాజిటివ్ రివ్యూలు అందుకుంది. అయితే బుక్ మై షోలో మాత్రం ఈ సినిమాకు దారుణమైన రేటింగ్స్ వచ్చాయి. దీని వెనుక ఓ ప్రముఖ హీరో టీమ్ ఉందని, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి కావాలనే తక్కువ రేటింగ్స్ ఇప్పించారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయం విజయ్ దేవరకొండ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
నా మీద, నా సినిమా మీద దాడులు జరుగుతున్నాయి. కొందరు డబ్బులు ఇచ్చి ఫేక్ రేటింగ్స్, ఫేక్ రివ్యూలు ఇప్పిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాదు నా మీద, మా సినిమాపైన సోషల్ మీడియాలో అటాక్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ దాటుకొని ఈ సినిమా ఇంతటి విజయం సాధించింది అంటే అది అభిమానుల వల్లే. వాళ్లు చూపించిన ప్రేమ వల్లే అని విజయ్ చెప్పాడు. డబ్బు సంపాదించాలని, అమ్మానాన్నలను హ్యాపీగా చూసుకోవాలని లక్ష్యంగా ఇన్నాళ్లూ సినిమాలు చేసి సంపాదించా.
ఇప్పుడు నేను గెలిస్తే ఇంతమంది సంతోషపడుతున్నారు. అందుకే ఇప్పటి నుండి మీ కోసం పనిచేయాలనుకుంటున్నా. మీరు ఆనందంగా ఉండటం నాకు ముఖ్యం. ‘ఖుషి’ సినిమా ఇచ్చిన ఖుషీని అందరితో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. అందుకే రాబోయే పది రోజుల్లో వంద కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుండి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఇస్తా. ఎందుకంటే మనమంతా దేవర ఫ్యామిలీ అని ఎమోషనల్ అయ్యాడు. అయితే ఆ ఫేక్ రివ్యూలు చేయిస్తున్న, రాయిస్తున్న వాళ్లు ఎవరు అనేది ఇప్పుడు చర్చ.
మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!
సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!