Vijay Devarakonda: లైగర్ సినిమా మీకే అంకితం.. విజయ్ కామెంట్స్ వైరల్!

రౌడీ హీరోగా తెలుగులో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా వచ్చే నెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కావడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.హైదరాబాదులోని సుదర్శన్ థియేటర్ లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున లైగర్ టీమ్ సందడి చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ నా సినిమా విడుదల అయ్యి రెండు సంవత్సరాలయింది అది కూడా పెద్దగా చెప్పుకోలేని సినిమా అని వెల్లడించారు.

ఇన్ని రోజుల తర్వాత వస్తుంటే ఈ సినిమా ట్రైలర్ కు మీ రచ్చ ఏందిరయ్యా అన్నారు. ఇక ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా విడుదలయ్యి ఇండియాని షేక్ చేస్తుంది రాసి పెట్టుకోండి. ఈ సినిమాని మీకే అంకితం చేస్తున్నాను అంటూ ఈయన తెలిపారు.

నాకు డాన్స్ అంటే చిరాకు కానీ మీకోసం ఈ సినిమాలో డాన్స్ చేశానని,ఇదే రేంజ్ లో సినిమా విడుదలైన తర్వాత సెలబ్రేషన్స్ జరగాలని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఈ సినిమా స్టైల్ లో నత్తితో మాట్లాడుతూ అభిమానులకు ఐ లవ్ యు చెప్పారు. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus