Kushi: ఖుషి సినిమాతో విజయ్, సామ్ ఖాతాలో రేర్ రికార్డ్.. మ్యాజిక్ రిపీట్ చేశారంటూ?

  • September 7, 2023 / 03:43 PM IST

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ఖుషి మూవీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది. కొన్ని ఏరియాలలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా మరికొన్ని ఏరియాలలో మాత్రం బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. అయితే తమిళనాడు రాష్ట్రంలో ఈ సినిమా అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో ఈ సినిమా 7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

విజయ్ దేవరకొండ, సమంతలకు తమిళ ప్రేక్షకుల్లో క్రేజ్ ఉండటం వల్లే ఈ స్థాయిలో కలెక్షన్లు సొంతమయ్యాయని సమాచారం అందుతోంది. తమిళనాడు రాష్ట్రంలో తెలుగు, తమిళ వెర్షన్లు ఈ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. లవ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. హేషం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని పాటలన్నీ ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి.

ఖుషి (Kushi) సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది. ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉండటం కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. శివ నిర్వాణకు ఖుషి సినిమా వల్ల కొత్త సినిమా ఆఫర్లు వచ్చాయని బోగట్టా. ఖుషి సినిమా కమర్షియల్ గా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని చెప్పవచ్చు.

విజయ్ దేవరకొండ, సామ్ కాంబోలో తెరకెక్కిన మహానటి మూవీ సక్సెస్ సాధించగా ఖుషి మూవీ సైతం సక్సెస్ సాధించి ఆ మయాజిక్ ను రిపీట్ చేసింది. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కాంబోలో మరిన్ని సినిమాలు వస్తాయో రావో చూడాల్సి ఉంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus