Vijay Deverakonda: ప్రేమ పుకార్లపై ఓ క్లారిటీ ఇచ్చిన VD!

టాలీవుడ్‌లో నెక్స్ట్‌ జెనరేషన్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ  (Vijay Devarakonda)  .. నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో  (Rashmika Mandanna)  డేటింగ్‌లో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలసి “గీత గోవిందం,” (Geetha Govindam) “డియర్ కామ్రేడ్”  (Dear Comrade) చిత్రాల్లో నటించారు. ఆ సినిమా కాలం నుండి వీరి మధ్య బంధం ఉందని అభిమానులు గుసగుసలాడుతున్నారు. కానీ విజయ్, రష్మిక ఎప్పుడూ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. తాజాగా విజయ్ దేవరకొండ తనపై వస్తున్న ప్రేమ పుకార్లకు ఒక క్లారిటీ ఇచ్చారు.

Vijay Deverakonda

ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ, తన వ్యక్తిగత జీవితంపై ఎప్పటికప్పుడు రూమర్లు వస్తుంటాయనీ, వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. “నిజంగా నేను ఏమైనా చెబుదామనుకుంటే, అది నా అభిమానులకు హ్యాపీగా షేర్ చేస్తాను. కానీ దానికి సరైన సమయం రావాలని భావిస్తున్నాను,” అని విజయ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో నెటిజన్లలో చర్చలు మరింత ఊపందుకున్నాయి. విజయ్ తన డేటింగ్ వార్తలపై పూర్తిగా నోరు మెదపకపోవడం పుకార్లను మరింతగా పెంచుతోంది.

ఫ్యాన్స్ మాత్రం ఈ సమాధానంతో సంతృప్తి చెందకుండా, ” ప్రేమకథకు ఆమోదముద్ర ఇస్తున్నారే,” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు రష్మిక ఇటీవల కొన్ని ఈవెంట్లలో విజయ్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా ప్రస్తావించడం, ఆమె వ్యాఖ్యలు ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చాయి. ప్రస్తుతం విజయ్ తన ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టారు. “VD 12” అనే గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తి అయ్యాక రాహుల్ సాంకృత్యన్‌తో మరో పీరియాడిక్ చిత్రం చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే రష్మిక కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. “పుష్ప 2”  (Pushpa 2: The Rule) విజయంతో ఆమె పాన్ ఇండియా రేంజ్‌లో నిలిచింది. ప్రస్తుతం “కుబేర,” (Kubera) “గర్ల్‌ఫ్రెండ్,” వంటి చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

కాంచన 4- ఈసారి బిగ్ రిస్క్ తో లారెన్స్ ప్లాన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus