ఉదయం షూటింగ్‌… రాత్రి పార్టీలు… ఫొటోలు వైరల్‌

రోమ్‌ వెళ్తే రోమన్‌లా ఉండాలని… ఓ పెద్దాయన అప్పుడెప్పుడో చెప్పారు. అలాగే బాలీవుడ్‌కి ఏ హీరో , హీరోయిన్‌ అయినా వెళ్తే అక్కడిలా ఉండాలి. అక్కడి వాళ్లతో, వాళ్లలా కలసిపోవాలి. ఈ అనధికారిక సూత్రాన్ని అనుసరించేవాళ్లు మాత్రమే బాలీవుడ్‌లో రాణించగలుగుతారు. ఈ సూత్రాన్ని విజయ్ దేవరకొండ తూ.చ. తప్పకుండా పాటిస్తున్నట్లు ఉన్నాడు. ‘లైగర్‌’తో పాన్‌ ఇండియా రేంజి సినిమా చేస్తున్న విజయ్‌ ప్రస్తుతం.. చిత్రీకరణ, సినిమా పనుల కోసం ముంబయిలో ఉన్నాడు. మొన్నీ మధ్య ముంబయి వెళ్తున్నా.. అంటూ ఓ ఫొటో సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఆ ఫొటోల సందడి పూర్తవ్వక ముందే సారా అలీ ఖాన్‌తో దిగిన ఓ ఫొటో షేర్‌ చేశాడు విజయ్‌.

దీంతో కుర్రాడు ముంబయి వెళ్లగానే అందరికీ ఫ్రెండ్స్‌ని చేసుకుంటున్నాడు సూపర్‌ అనుకున్నారు. అయితే ఆ జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరికొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా అప్పుడప్పుడు బాలీవుడ్‌ ప్రముఖులకు పార్టీలు ఇస్తూ ఉంటాడు. ఇటీవల కూడా ఓ పార్టీ ఇచ్చాడు. దానికి ‘లైగర్‌’ టీమ్‌ హాజరైంది. ఆ ఫొటోలే ఇప్పుడు వైరల్‌గా మారాయి. కరణ్‌ జోహార్‌, పూరి జగన్నాథ్‌, చార్మితో విజయ్‌ దేవరకొండ ఈ పార్టీకి హాజరయ్యాడు. అయితే ‘లైగర్‌’టీమ్‌లో హీరోయిన్‌ అనన్య పాండే కనిపించలేదు.

ఆమె కాకుండా కియారా అడ్వాణీ, సారా అలీఖాన్‌ ఆ ఫొటోల్లో సందడి చేసింది. నిజానికి ‘లైగర్‌’ టీమ్‌లో మనీశ్‌కి బాగా పరిచయం ఉన్నవాళ్లలో కరణ్‌ జోహార్‌ ఒక్కడే. ఆ పరిచయంతోనే మొత్తం ‘లైగర్‌’ టీమ్‌ను ఇన్వైట్‌ చేసినట్లున్నారు. లేదంటే ‘బుడ్డాహోగా తేరా బాప్‌’ సమయంలో పూరితో మనీశ్‌కు పరిచయం ఏర్పడి ఉండాలి. లేదంటే చార్మి వైపు నుండేనా పరిచయం ఉండి ఉండాలి. ఇలా కొందరు లెక్కలేసుకుంటుంటే… విజయ్‌ దేవరకొండకు ముంబయి నీళ్లు బాగా వంటబట్టాయని… బీటౌన్‌కు వెళ్లగానే పార్టీల్లో ఎంజాయ్‌ చేస్తున్నాడని అంటున్నారు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus