పూరి సినిమాకోసం విజయ్ కు రెండు నెలల ట్రైనింగ్ ?

ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్ కు ఓ హిట్టొస్తే.. ఇక తరువాతి సినిమాని కూడా అదే జోష్ లో తెరకెక్కించి హిట్టందుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు పూరి కూడా అదే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూరి ఎట్టకేలకు ‘ఇస్మార్ట్ శంకర్’ తో హిట్టందుకున్నాడు. ఈ చిత్రంతో ఇప్పటివరకూ చేసిన అప్పులన్నీ తీర్చేసాడు. ఇప్పుడు పూరి ఫుల్ జోష్ లో ఉన్నాడు. విజయ్ దేవరకొండ వంటి క్రేజీ హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.

మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తుంది. ఇందుకోసం నిర్మాతలు విజయ్ దేవరకొండకు ట్రైనింగ్ ఇవ్వటం కోసం ఓ కోచ్ ను కూడా ఏర్పాటు చేసారట. త్వరలోనే ట్రైనింగ్ మొదలు కానుంది. రెండు నెలలు పాటు విజయ్ కు ట్రైనింగ్ తీసుకుంటాడట. ఈ గ్యాప్ లో పూరి తన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో బిజీగా ఉంటాడని తెలుస్తుంది. ‘పూరి టూరింగ్ టాకీస్’ ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్ల పై పూరి, ఛార్మీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది.

‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus