Vijay Rashmika: బీచ్ రిసార్ట్‌లో విజయ్ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?
- October 5, 2026 / 12:50 PM ISTByFilmy Focus Desk
విజయ్ దేవరకొండ – రష్మిక మందన కాస్తా దేవరకొడ విజయ్ – రష్మికగా ఇటీవల మారారు. వారి పెళ్లి తర్వాత మీడియా ముందుకు తొలిసారి వస్తుండటంతో ‘రణబాలి’ సినిమా ఇంటర్వ్యూలు కాస్తా.. విజయ్ – రష్మిక పోస్ట్ మ్యారేజ్ ఇంటర్వ్యూల్లా మారిపోయాయి. ఎవరు ఇంటర్వ్యూ చేసినా.. వారి పెళ్లి గురించి, పెళ్లి తర్వాత పరిస్థితుల గురించి అడిగే ప్రశ్నలతో ఆ ఇంటర్వ్యూ నిండిపోతోంది. ఇప్పుడు యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూ కూడా అలానే మారిపోయింది.
Vijay Rashmika
విజయ్ దేవరకొండ – రష్మిక దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 16న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. ఈ క్రమంలో విజయ్, రష్మిక రాహుల్ సాంకృత్యాన్ కలసి సుమ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్మికతో తన పెళ్లి గురించి మాట్లాడుతూ విజయ్ ఓ ఆసక్తికర చెప్పుకొచ్చారు. దీంతో ఇలా ఎలా అనుకున్నావ్ విజయ్ అంటున్నారు ఫ్యాన్స్.
అందరిలా పెళ్లి మంటపంలో కాకుండా, బీచ్‌లో షార్ట్స్ ధరించి రష్మికను వివాహం చేసుకోవాలని విజయ్ దేవరకొండ అనుకున్నారట. అంతేకాదు ఆ ఆలోచనకు రష్మిక కూడా ఓకే చెప్పింది. అయితే విజయ్ తల్లిదండ్రులు అంగీకరించలేదట. దీంతో మండపంలోనే గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాం అని విజయ్ చెప్పుకొచ్చాడు. నాలో ఇద్దరు మనుషులున్నారు. ఏం చేసినా సింపుల్‌గా ఉండాలనుకునేది ఒకరు. అందరూ మాట్లాడుకొనేలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉండాలన్నది మరొకరి ఆలోచన అని విజయ్ చెప్పాడు.
పెళ్లి విషయంలోనూ అదే జరిగింది. తొలుత అందమైన బీచ్‌లో షార్ట్స్ వేసుకొని.. స్నేహితుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఏ బీచ్‌లో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కొందరు ఫ్రెండ్స్‌ని అడిగాను. ఏదో నిర్ణయం తీసుకుందామని ప్లాన్ చేశాను. అదే సమయంలో ఇంట్లో చెబితే మా అమ్మ షాకై నన్ను కొట్టినంత పని చేసింది. ఇంట్లో పెద్దకొడుకు అలా పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుందని బాధపడింది. దీంతో మండపంలోనే పెళ్లి చేసుకున్నాం.
పెళ్లి గురించి రష్మిక మాట్లాడుతూ.. పెళ్లి ఎలా చేసుకోవాలనుకున్నా ఓకే అని విజయ్‌తో చెప్పాను. తను సంతోషంగా ఉంటే నేనూ సంతోషంగా ఉంటా కదా. అయితే పెళ్లి సమయంలో ఇంట్లో వారికి ఓ కండీషన్ పెట్టాను. పెళ్లికి ముందు, ఆ తరువాత మీరు ఏం చెప్పినా చేస్తాను. అయితే పెళ్లి జరిగే మూడు రోజులు నన్ను ఫ్రీగా వదిలేయండి. నేను నా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తా అని చెప్పాను. అన్నట్లే ఆ మూడు రోజులూ హ్యాపీగా గడిపాను అని చెప్పింది.
















