Vijay Sethupathi: ఎలాంటి తెలుగు సినిమాలు చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన హీరో?

  • August 16, 2022 / 02:06 PM IST

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి మాస్టర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయమయ్యారు. ఇలా ఈ సినిమాతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈయన తెలుగులో ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఈ విధంగా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈయన పుష్ప 2సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని ఇలా పోలీస్ ఆఫీసర్ పాత్ర ద్వారా బన్నీకి సహాయం చేస్తూ కనిపిస్తారని పెద్ద ఎత్తున ఈయన పాత్ర గురించి వార్తలు షికార్లు చేశాయి. ఇక ఈ సినిమాతో పాటు విజయ్ సేతుపతి అట్లీ దర్శకత్వంలో నయనతార షారుఖ్ ఖాన్ నటించిన బాలీవుడ్ చిత్రం జవాన్ సినిమాలో కూడా విలన్ పాత్రలో నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ విధంగా విజయ్ సేతుపతి గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో ఈ వార్తలపై ఆయన పిఆర్ఓ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా విజయ సేతుపతి పిఆర్ఓ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ విజయ్ సేతుపతి పుష్ప2 సినిమాలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం లేదని కేవలం పుకార్లు మాత్రమేనని ఈయన వెల్లడించారు.ఇక విజయ్ సేతుపతి అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారని,

ప్రస్తుతం ఆయన ఎలాంటి తెలుగు సినిమాలలో కూడా చేయడం లేదని పేర్కొన్నారు.ఇక జవాన్ సినిమాలో కూడా విలన్ పాత్రలో రానా నటించాల్సి ఉంది కానీ కొన్ని పరిస్థితుల కారణంగా రానా తప్పుకోవడంతో స్వయంగా షారుక్ ఖాన్ విజయ్ సేతుపతి పేరును సూచించినట్లు ట్వీట్ చేస్తూ తన గురించి వస్తున్నటువంటి వార్తలకు చెక్ పెట్టారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus