Vijay Varma: ఆ హీరోయిన్ తో లవ్ ఎఫైర్ పై విజయ్ వర్మ షాకింగ్ కామెంట్స్..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో మనందరికీ బాగా తెలిసిన విషయమే. కాగ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ జంట ప్రేమించుకుంటున్నారు అని .. డేటింగ్ చేసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపించాయి . అయితే వాటిపై ఇన్నాళ్లు మౌనం వహించిన ఈ జంట రీసెంట్ గానే లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా డేటింగ్ పై ఓపెన్ అప్పయ్యారు.

రెండు రోజుల క్రితమే తమన్నా..” నేను విజయవర్మతో (Vijay Varma) డేటింగ్ చేస్తున్న విషయం వాస్తవమే “అంటూ ప్రేమ విషయంపై ఓపెన్ అయింది . ఈ క్రమంలోనే రీసెంట్గా విజయవర్మ సైతం తన ప్రేమ పై ఓపెన్ అప్ అయ్యాడు. లాస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయవర్మ – తమన్నాతో డేటింగ్ పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ..” నా జీవితం చాలా చాలా హ్యాపీగా ఉంది .

దానికి మెయిన్ రీజన్ పబ్లిక్ కి నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే చెప్పాలి అనుకున్నాను ..పర్సనల్ లైఫ్ ని ఎప్పుడు దూరంగానే ఉంచుదాం అనుకున్నాను.. అయినా ఏంటో అందరికీ తెలిసిపోతుంది ..తమన్నాతో ప్రేమ విషయం బయట పెట్టాలని అనుకోలేదు. కానీ అది ఆటోమేటిక్గా లీక్ అయిపోయింది”. “మొదటినుంచి నాకు నా పర్సనల్ విషయాలలో ఎవరు తల దుర్చడం ఇష్టం లేదు.

ఆ కారణంగానే ఈ మేటర్ ను సీక్రెట్ గా దాచాను ” అంటూ తాను ఎందుకు తమన్నా విషయం మీడియాకి చెప్పలేదో చెప్పుకొచ్చారు . ఏది ఏమైనా సరే ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలి అనుకుంటున్నారు తమన్నా – విజయవర్మ ఫ్యాన్స్. చూడాలి మరి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారో ఈ జంట..!

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus