Vijayashanthi: సీనియర్ ఎన్టీఆర్ ను కళ్యాణ్ రామ్ ను పోల్చుతూ విజయ్ శాంతి ట్వీట్!

ఒకానొక సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి విజయశాంతి ఒకరు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి ఈమె క్రమక్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. సినిమాలకు దూరమైనటువంటి విజయశాంతి రాజకీయాలలో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. ఈ విధంగా ఈమె రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు

అయితే మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ సినిమాలో ఒక లెక్చరర్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించినటువంటి ఈమె సరైన కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు కనుక వస్తే తప్పకుండా తిరిగి సినిమాలలో నటిస్తానని వెల్లడించారు. ఈ క్రమంలోనే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తన 21వ సినిమాని ప్రకటించారు.

ఈ సినిమాలో ఈమె కూడా కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలలో భాగంగా విజయశాంతి కూడా హాజరయ్యారు. ఈ పూజ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పూజా కార్యక్రమాల అనంతరం విజయశాంతి కళ్యాణ్ రామ్ పై ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు. గతంలో ఈమె సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా పూజ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఫోటోతో పాటు తాజాగా కళ్యాణ్రామ్ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫోటోని కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ…

ఆనాడు లెజెండ్ ఎన్టీఆర్ గారు 30 సంవత్సరాల ముందు ఒక సినిమా ప్రారంభం నాడు నాకు ఇచ్చిన గౌరవం, అట్లే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా ముహూర్తం రోజు నాకు ఇచ్చిన గౌరవం.. ఎప్పుడూ కూడా కళాకారిణిగా నాకు ప్రోత్సాహం, ప్రేరణ కల్పించే సందర్భాలే అంటూ చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారడంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus