Vijayashanti: కళ్యాణ్ రామ్ సినిమాలో విజయ్ శాంతి?

2020 సంక్రాంతికి రిలీజ్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ఆ సినిమాలో ఆమె అతి కీలకమైన పాత్ర పోషించింది అని చెప్పాలి. ఆ సినిమా కథ మొత్తం.. ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది.ఇంకా చెప్పాలంటే హీరోయిన్ రష్మిక పాత్ర కంటే కూడా విజయశాంతి పాత్రే కీలకమని చెప్పొచ్చు. అలా అని ఆమె హీరోకి తల్లిగా చేయలేదు, అక్కగాను నటించలేదు. నిజానికి తల్లి పాత్రలు అంటే ఈమె చేయను అని మొహమాటం లేకుండా చెప్పేసింది.

అందుకే దీనికి ముందు ‘రాజా ది గ్రేట్’ సినిమాలో తల్లి పాత్రని కూడా ఆమె (Vijayashanti) రిజెక్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా.. ‘సరిలేరు’ తర్వాత విజయశాంతి వరుస సినిమాల్లో నటించింది లేదు. ఎన్టీఆర్ – కొరటాల శివ..ల ‘దేవర’ సినిమాలో కూడా ఆమెకు నటించే ఛాన్స్ లభించింది. ఇక విజయశాంతి సినిమాల్లో కనిపించదు అని అంతా ఫిక్స్ అయిపోయిన టైంలో.. మళ్ళీ మేకప్ వేసుకోవడానికి రెడీ అవ్వడం విశేషంగా చెప్పుకోవాలి.

అవును కళ్యాణ్ రామ్ హీరోగా అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్ల పై ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. ప్రదీప్ చిలుకూరి ఈ ప్రాజెక్టుకి దర్శకుడు. ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది ఈ మూవీ.కళ్యాణ్ రామ్ 21వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus