టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని మరో లెవెల్ కు తీసుకువెళ్లే సినిమా RRR అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగా, నందమూరి హీరోల నుంచి వస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్ గా ఎంతో మంది ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో RRR రచయిత కె విజయేంద్ర ప్రసాద్ సినిమా సన్నివేశాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎక్కువగా రివీల్ చేయలేదు గాని కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం మునుపెన్నడు చూడనంత ఎమోషనల్ గా ఉంటాయని అన్నారు.
‘మన సినిమా గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర ఒక సన్నివేషంలో కంటతడి పెట్టించేలా ఉంటుంది. తారక్ యాక్షన్ సీన్ లో చాలా ఎమోషనల్ గా నటించాడు. ఎన్నిసార్లు చూసినా నాకే కన్నీళ్లు ఆగలేదు. అభిమానులకు కూడా అలానే అనిపిస్తుంది..’ అని వివరణ ఇచ్చారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో తనకు చాలా ఇష్టమైన సినిమా అదుర్స్ అని అందులో ఎన్టీఆర్ పండించిన కామెడీ ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదని చెప్పారు.
ఇక తారక్ ఇప్పటివరకు అన్ని రకాల పాత్రల్లో సంతృప్తి పరిచాడు అంటూ.. కానీ ఎమోషనల్ క్యారెక్టర్స్ లలో పూర్తి స్థాయిలో మెప్పించలేదని ఇక RRRతో ఆ వెలితి ఉండదని కూడా విజయేంద్రప్రసాద్ తెలియజేశారు.
Most Recommended Video
10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!