‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఎలా ఉంటాయి అనేది ఇప్పటికే తెలిసిపోయింది. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే లెక్కలు అభిమానులు వేసుకుంటున్నారు. అయితే ఆ పాత్రలు రాసిన కథారచయిత విజయేంద్ర ప్రసాద్ ఏమంటున్నారు, ఆయనకు ఏ పాత్ర అంటే ఇష్టం. సీతారామరాజు పాత్ర వేసిన రామ్‌చరణ్ పాత్ర బాగా నచ్చిందా? లేక కొమురం భీమ్‌గా కనిపించిన ఎన్టీఆర్ పాత్ర బాగా నచ్చిందా? అని అయన్ను అడిగితే ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు.
పోస్టర్‌లో మా హీరో పేరు ముందు పడింది, మీ హీరో వెనుక ఉన్నాడు. మా హీరో చెయ్యి పైన ఉంది, మీ హీరో కాలు వెనుకుంది అంటూ లెక్కలేసుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ… పాత్ర పరంగా తన ఫేవరెట్ చరణ్ చేసిన రామరాజు క్యారెక్టరే అని చెప్పారు. ఇప్పుడు ఆయన తండ్రి, సినిమా కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఇంచుమించు ఇదే మాట అన్నారు. అయితే ఆయన కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా అన్నారు.
ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలు చూస్తే… కొమరం భీమ్ పాత్ర చాలా వేగంగా ఆకట్టకుంటుంది. ఆ పాత్ర అడవి బిడ్డ కావడంతో చూడగానే ఆకట్టుకుంటుంది. అడవిలో పువ్వు, జంతువునో ఎంత స్వచ్ఛంగా ఉంటాయో… భీమ్ పాత్ర కూడా అలానే ఉంటుంది అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. రామ్ చరణ్ చేసిన రామరాజు పాత్ర సంక్లిష్టమైంది. ఆ పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయి. లోలోన బాధపడుతూ, సంఘర్షణ అనుభవించే పాత్ర రామరాజు అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్‌ను ఎన్టీఆర్ ‘అన్న’ అని పిలుస్తాడని… కాబట్టి చరణ్ చేసింది పరిణతితో కూడిన, పెద్ద వాడి పాత్ర అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ పాత్రను పోషించడం చాలా కష్టమని విజయేంద్ర అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ అంటే వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమని, కానీ ఈ సినిమా వరకు రామ్ చరణ్‌కు తాను రెండు మార్కులు ఎక్కువే వేస్తానని కూడా చెప్పారు విజయేంద్రప్రసాద్. అలా అని భీమ్ పాత్రను రాజమౌళి తగ్గించి ఉండడు, బ్యాలెన్స్ చేసే ఉంటాడు అని చెప్పారు విజయేంద్రప్రసాద్.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!