డిజాస్టర్ టాక్ తో 50 కోట్ల షేర్ ను రాబట్టిన ‘వినయ విధేయ రామా’

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వినయ విధేయ రామా’ చిత్రానికి మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ మంచి కల్లెక్షన్లనే నమోదుచేస్తుంది.

మొదటిరోజు ఈ చిత్రానికి వచ్చిన టాక్ కి కనీస వసూళ్ళు వస్తాయని ఎవరూ అనుకోరనుకోవడంలో సందేహంలేదు. అయితే రాంచరణ్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్, సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొదటివారం రూ.50.08 కోట్ల షేర్ ని రాబట్టింది. ఒక్క నైజాంలోనే ఈ చిత్రం 12 కోట్లకి పైగా షేర్ ని వసూల్ చేయడం విశేషం.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘వినయ విధేయ రామా’ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం- 12.06 కోట్లు

వైజాగ్- 6.65 కోట్లు

ఈస్ట్ – 4.58 కోట్లు

వెస్ట్- 3.77 కోట్లు

కృష్ణ- 3.35 కోట్లు

గుంటూరు- 6.05 కోట్లు

నెల్లూరు- 2.62 కోట్లు

సీడెడ్- 11 కోట్లు

——————————-
ఏపీ & టీఎస్ కలెక్షన్స్- 50.08 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus