Vinodhaya Sitham: ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ లేట్‌కి కారణమిదేనా?

‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌.. ఈ మాట అంటే పవన్‌ కల్యాణ్‌ అభిమానులు చిన్న టెన్షన్‌ పడుతున్నారు. సినిమా ఎలా ఉంటుంది. పవన్‌కి సరిపోతుందా? అసలు కథ చూస్తుంటే పవన్‌కు పెద్దగా ఉపయోగపడేలా లేదు అని అంటున్నారు. ఈలోపు సినిమా ఉంది? లేదు అనే టాక్‌ వచ్చేసరికి హమ్మయ్య అనుకున్నారు. ఇంతలోనే త్వరలో సినిమా ప్రారంభం అని అంటున్నారు. అయితే ఇప్పటికప్పుడు సినిమా స్టార్ట్‌ చేస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.

దీనికి మూడు కారణాలు చెబుతున్నారు. ఒకటి పవన్‌ కల్యాణ్‌ అయితే, రెండోది సాయిధరమ్‌ తేజ్‌. ఇక మూడోది దర్శకుడు కమ్‌ నటుడు సముద్రఖని. ఆఖరి కారణం ముందుగా చూసుకుంటే.. సముద్రఖని ప్రస్తుతం నటుడిగా చాలా బిజీగా ఉన్నారు. సౌత్‌లో అన్ని లాంగ్వేజ్‌ల్లోనూ ఆయన నటిస్తూ తీరికలేకుండా ఉన్నారు. ఉన్నఫళంగా వాటిని ఆపేసి ఈ సినిమా స్టార్ట్‌ చేస్తే ఆ నిర్మాతలు ఇబ్బందిపడతారు. కాబట్టి ఆయనకూ కష్టమే, ఆయన ఓకే అనుకుంటే.. ఆ నిర్మాతలు సరే అంటే మొదలయ్యే అవకాశం ఉంది.

అయితే అంతకంటే ముందు హీరోలు సిద్ధంగా ఉండాలి. ‘వినోదాయ చిత్తాం’ సినిమాను తెలుగులో పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ చేస్తారు అని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు చూస్తే పవన్‌, సాయితేజ్‌ ఆరోగ్యం అంతబాగా లేదు అంటున్నారు. మొన్నీమధ్య ‘రంగ రంగ వైభవంగా’ ఈవెంట్‌కి వచ్చిన సాయితేజ్‌ కాస్త ఇబ్బందిగానే కనిపించాడు. కొత్త సినిమా షూటింగ్‌కి కూడా తరచుగా బ్రేక్‌లు వస్తున్నాయని టాక్‌.

ఇక పవన్‌ కల్యాణ్ అయితే వెన్ను నొప్పితో బాధపడుతున్నారని అంటున్నారు. అందుకే ఈ మధ్య ఏ సినిమా షూటింగ్‌లు పెట్టుకోవడం లేదట. ఇలాంటప్పుడు ఇద్దరూ ముందుకొచ్చి సినిమా స్టార్ట్‌ చేస్తారా అనే ప్రశ్న వినిపిస్తోంది. అన్‌ఫిట్‌గా ఉండి సినిమా మొదలై తర్వాత ఇబ్బంది పడితే నిర్మాతలు ఇబ్బందిపడతారు. కాబట్టి ఫిట్‌ అయ్యాక మొదలుపెట్టి వేగంగా పూర్తి చేసేయాలి. ఇలా మధ్యలో ఆగడం లాంటివి అయితే కష్టమే. సో. ఈ సినిమాపై క్లారిటీ పవనే ఇవ్వాలి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus