ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు, పద్మ అవార్డుల గ్రహీత టీఎన్ కృష్ణన్ (92) చెన్నై నగరంలో కన్నుమూశారు. ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు కానీ సోమవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యి.. తన నివాసంలోనే తుదిశ్వాసవిడిచారు . కృష్ణన్ మరణవార్త విన్న అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత నెలలో తన పుట్టినరోజు వేడుకల్లో ఎంతో చలాకీగా కనిపించిన కృష్ణన్ మృత్యువాత పడడం నమ్మలేకపోతున్నామని.. ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తన కెరీర్ లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
చెన్నై మ్యూజిక్ కళాశాలలో పనిచేసిన కృష్ణన్ చాలామంది విద్యార్థులకు వయోలిన్ నేర్పించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ డీన్ గా కూడా వ్యవహరించారు. ఆయన మెచ్చిన ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత కళానిది వంటి పలు పురస్కారాలతో కృష్ణన్ కు సత్కరించింది. దేశంలో వేలాది సంగీత కచేరీలు చేసిన కృష్ణన్ మృతి పట్ల సంగీతప్రియులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?