Ravikrishna: విరూపాక్ష సినిమా రవికృష్ణకు ఈ రేంజ్ లో ప్లస్ అయిందా?

  • April 28, 2023 / 07:38 PM IST

విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఈ సినిమాలో నటించిన నటీనటులకు సైతం మంచి పేరు వచ్చింది. బిగ్ బాస్ షో ద్వారా మంచోడిగా పేరు సంపాదించుకున్న రవికృష్ణ విరూపాక్ష సినిమాలో తన నటనతో మెప్పించారు. ఆ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే రవికృష్ణ ఈ స్థాయికి చేరుకోవడానికి అనుభవించిన కన్నీటి కష్టాలు మాత్రం అన్నీఇన్నీ కావు.
బుల్లితెరపై పలు సీరియళ్లలో నటించిన రవికృష్ణకు ఆ సీరియళ్లు సైతం మంచి పేరును తెచ్చిపెట్టాయి.

రవికృష్ణ స్వస్థలం విజయవాడ కాగా తండ్రి ఆర్టీసీ ఉద్యోగిగా పని చేసేవారు. తెలుగులో విజేత, విజయం, మొగలిరేకులు, హృదయం, వరూధిని పరిణయం మరిన్ని సీరియల్స్ లో రవికృష్ణ నటించారు. అయితే ఈ సీరియళ్లలో చాలా సీరియళ్లు ప్రేక్షకాదరణ పొందలేదు. అందువల్ల రవికృష్ణకు మరీ భారీ స్థాయిలో అయితే పాపులారిటీ అయితే రాలేదు. విరూపాక్షతో తాను కోరుకున్న విజయం దక్కడంతో రవికృష్ణ ఒకింత ఎమోషనల్ అయ్యారు.

దర్శకుడు కార్తీక్ దండుకు (Ravikrishna) రవికృష్ణ కృతజ్ఞతలు చెప్పారు. సినిమా హీరో రేంజ్ లో ఉన్నప్పటికీ రవికృష్ణ కెరీర్ పరంగా సీరియల్స్ కే పరిమితమయ్యారు. విరూపాక్ష సక్సెస్ తో రవికృష్ణ దశ తిరుగుతుందేమో చూడాలి. రవికృష్ణ ప్రయత్నిస్తే ఆయనకు మరిన్ని సినిమా ఆఫర్లు రావడంతో పాటు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు అయితే దక్కడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. రవికృష్ణ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం ఆయనకు రాబోయే రోజుల్లో ఆఫర్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది.

రవికృష్ణ కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడితే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. విరూపాక్ష సక్సెస్ తో రవికృష్ణ రెమ్యునరేషన్ సైతం పెరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్లు రవికృష్ణకు ఛాన్స్ ఇస్తే అతని కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus