కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.అతను నటించిన ‘మార్క్ ఆంటోని’ సినిమా ఈరోజు అనగా సెప్టెంబర్ 15 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లి వార్తల గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు విశాల్. విశాల్ మాట్లాడుతూ.. “సాధారణంగా నేను వివాదాల గురించి పట్టించుకోను,స్పందించను. అయితే ఇటీవల ఒక ట్వీట్ చేశాను.
హీరోయిన్ లక్ష్మీ మీనన్ ను నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇది నాకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, అవతలి అమ్మాయి భవిష్యత్ కి సంబంధించిన విషయం కూడా. కాబట్టి నేను స్పందించకపోతే, ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుంది. నా గురించి ఏ విషయమైనా మీరు ఫోన్ చేసి అడగవచ్చు. గతంలో నేను చాలా మందిని పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు రాశారు. ఇంకా చెప్పాలంటే నా 19 ఏళ్ళ సినీ కెరీర్లో ఇప్పటిదాకా 12 మందిని పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం చేశారు.
చిన్నప్పటి నుండి నాకు సంబంధించిన విషయాలు పేపర్లో వస్తే, కట్ చేసి భద్రపరచడం మా నాన్నగారికి ఓ అలవాటు. అలా ఒకరోజు ఏదో పేపర్ కట్ చేస్తుంటే, ఏం చేస్తున్నారు అని అడిగా, దానికి ఆయన ‘లక్ష్మీ మేనన్ తో నీకు పెళ్లి అని వార్త వచ్చింది’. అంటూ చెప్పారు. హీరోయిన్లలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు.
ఎప్పుడైనా లంచ్, డిన్నర్, సినిమాకో వెళదామని వాళ్ళు అడిగితే , నేను వద్దని చెబుతాను. బయట జంటగా కనిపిస్తే, డేటింగ్ లో ఉన్నామని పుకార్లు పుట్టించేస్తారు. అందుకే మా ఇంట్లోనే భోజనం చేసి, సరదాగా కబుర్లు చెప్పుకుంటాం తప్ప బయటకు వెళ్ళం. టాలీవుడ్లో రానా, నితిన్, నాని నాకు క్లోజ్ ఫ్రెండ్స్” అంటూ విశాల్ (Vishal) చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!