Vishal: 12 ఏళ్ల తర్వాత ఆ సినిమా బయటకు… సంక్రాంతి బరిలో విశాల్‌ కూడా..!

వచ్చేస్తున్నాం.. వచ్చేస్తున్నాం అంటూ గత కొన్ని రోజులుగా ఊరించిన ‘విదా మయూర్చి’ సినిమా టీమ్‌ ఆఖరి సమయానికి వచ్చేసరికి ‘తూచ్‌ మేం రాం’ అని చేతులెత్తేసింది. దాని వెనుక చాలా విసయాలు ఉన్నాయి అని కోడంబాక్కం వర్గాల మాట. ఆ విషయాలేమో కానీ ఆ సినిమా రాకపోవడం వల్ల పుష్కర కాలం నాటి ఓ పాత సినిమా ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటోంది అని అంటున్నారు. అదే ‘మద గజ రాజా’. ఏంటీ ఈ సినిమా రీరిలీజ్‌ చేస్తున్నారా అని అనొద్దు. ఎందుకంటే ఇది ఫస్ట్‌ రిలీజే.

Vishal

విశాల్ (Vishal) హీరోగా సుందర్.సి (Sundar C) తెరకెక్కించిన చిత్రం ‘మదగజరాజా’ 2012లో ఈ సినిమా మొదలైంది. సగటు విశాల్‌ సినిమాలనే ఏడాదికే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ వివిధ కారణాల వల్ల సినిమా విడుదల కాలేదు. మధ్యలో ఒకటి రెండుసార్లు ప్రయత్నం జరిగినా సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. విశాల్ మంచి జోరు మీదున్నప్పుడే ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడం గమనార్హం. కానీ ఇప్పుడు తెస్తామంటున్నారు

‘విదా మయూర్చి’ తప్పుకోవడంతో తమిళనాట ఈ పొంగల్‌ సీజన్‌ ఏ సినిమా లేకుండా ముగిసిపోవాలా అనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో ‘మద గజ రాజా’ వస్తుంది అని చెబుతున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), అంజలి (Anjali) హీరోయిన్లుగా నటించగా.. సంతానం ఓ కీలక పాత్రలో నటించాడు. అన్నింటికి మించి ‘బాక్: అరణ్మయి 4’ (Baak) సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సుందర్ తీసిన సినిమా కావడం ప్రచారానికి భలే ప్లస్‌.

అన్నట్లు ఈ సినిమా రిలీజ్‌ సమస్యే కాదు. చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అంటారు. తొలుత హీరోయిన్ల పాత్రల కోసం శ్రుతి హాసన్ (Shruti Haasan) , హన్సిక (Hansika Motwani), కార్తిక (Karthika Nair), తాప్సి (Taapsee Pannu) పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా వరలక్ష్మి, అంజలి ఓకే అయ్యారు. ఇక ఈ సినిమాలో ధనుష్‌ (Dhanush) మూడు పాత్రల్లో కనిపిస్తాడని టాక్‌ వచ్చినా.. అదేమీ లేదని చెప్పారు. జనవరి 14, 2013న వస్తుందని చెప్పిన ఈ సినిమా జనవరి 12, 2025కి రావొచ్చని టాక్‌.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus