భగవద్గీత చదువుకునే అమ్మాయిని.. హాట్ సీన్స్ చెయ్యాల్సి వచ్చింది : విష్ణు ప్రియ

Advertisement

అనసూయ,రష్మీ, శ్రీముఖి వంటి హాట్ యాంకర్ల లిస్ట్ లో తాజాగా.. విష్ణుప్రియ కూడా చేరిపోయిన సంగతి తెలిసిందే. తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో కూడా కుర్రకారుని ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ అమ్మడు. త్వరలోనే ‘చెక్‌మేట్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది విష్ణుప్రియ. ‘చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ప్రసాద్ వెలంపల్లి డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నిజానికి కొన్నేళ్ల క్రితమే ప్రారంభమయ్యింది. కానీ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల లేటయ్యిందని సమాచారం.

ఎట్టకేలకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. ఇక విష్ణుప్రియ ఈ చిత్రంలో ఓ రేంజ్లో గ్లామర్ షో చేసింది. ఆ సన్నివేశాల గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించి ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో నేను చాలా హాట్ రోల్ చేశాను. ఓ 20.. 30మంది చూస్తుండగానే హాట్ సీన్స్ లో నటించాను. ”నిజానికి నేను హాస్టల్లో భగవద్గీత చదువుకునే అమ్మాయిని. 18 ఏళ్ల వయసులో ఉన్న నన్ను.. సడన్‌గా ఇలాంటి హాట్ రోల్ చెయ్యమని అన్నారు.

కథ డిమాండ్ చెయ్యడం వల్ల కొన్ని హాట్ సీన్స్ చెయ్యక తప్పలేదు. నిజానికి ఇది చాలా కష్టం కానీ.. మా డైరెక్టర్ ఎంతో కంఫర్టబుల్‌గా తెరకెక్కించారు. ఆ సీన్స్ చేసేది నేను కాదు.. ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ అంటూ నాకు ధైర్యం చెప్పాడు.అందువల్లే నన్ను నేను మోటివేట్ చేసుకొని కెమెరా ముందు హాట్ సీన్స్ చేశాను” అంటూ చెప్పుకొచ్చింది విష్ణుప్రియ.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus