విశ్వక్ సేన్ మూవీతో డైరెక్టర్ గా మారబోతున్న సినిమాటోగ్రాఫర్..!

  • February 4, 2021 / 09:30 AM IST

కెమెరామెన్ లు డైరెక్టర్ లుగా మారడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. ఇప్పటికే శివ, గుహన్ వంటి వారు డైరెక్టర్లుగా మారి రాణిస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే ఓ టాలీవుడ్ యంగ్ సినిమాటోగ్రాఫర్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నాడు.అతనెవరో కాదు విద్యా సాగర్. విశ్వక్ సేన్ హీరోగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొందనుంది.ఈ చిత్రానికి విద్యాసాగర్ డైరెక్ట్ చేస్తున్నాడు.అసలు ఎవరు ఈ విద్యా సాగర్ అని మీకు డౌట్ రావచ్చు.

హైదరాబాద్ లోని ఫిల్మ్ మేకింగ్ లో ఇతను శిక్షణ తీసుకున్నాడు. తరువాత విశ్వక్ సేన్ డైరెక్ట్ చేసిన ‘ఫలక్ నుమా దాస్’కు విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందించాడు. ‘అంగమలి డైరీస్’కు రీమేక్ గా తెరకెక్కిన… ఈ చిత్రానికి విద్యాసాగర్ తనదైన ప్రతిభను చాటుకున్నాడు.అటు తర్వాత ‘రాజావారు రాణిగారు ‘ ..శ్రీహరి కొడుకు హీరోగా నటించిన ‘రాజ్ దూత్’ చిత్రాలకు కూడా విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందించాడు.

ఇతను మంచి రిటైర్ కూడా అని తెలుస్తుంది. అందుకే విశ్వక్ సేన్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం దక్కినట్టు తెలుస్తుంది. ఇది ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. రితిక నాయక్ అనే ఢిల్లీ బ్యూటీ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus