Vishwambhara: ఎన్నేళ్లు అయిందో ఇలాంటి సంబరం చూసి.. కీరవాణి అంటే ఇంతే మరి!

  • July 18, 2024 / 11:07 AM IST

మొన్నీమధ్యే మన సైట్‌లో చదివి ఉంటారు మీరు ఈ వార్త. అలా అని ఇది పాత విషయం చెప్పడం కాదు. ఎందుకంటే మొన్నటి వార్తకు ఇది యాడ్‌ ఆన్‌. ఆ రోజు వార్తలో సమ్‌థింగ్‌ స్పెషల్‌గా టాలీవుడ్‌లో జరుగుతోంది అని చెప్పాం. ఇప్పుడు దానికి దృశ్యరూపకంగా ఈ వార్తలో చెబుతున్నాం. ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా కోసం సినిమా టీమ్‌ బెంగళూరులోని చిరంజీవి  (Chiranjeevi)  ఫామ్‌ హౌస్‌లో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ చేపట్టారు అని వార్త చదివే ఉంటారు. ఇప్పుడు దాని గురించే ఇదంతా.

టాలీవుడ్‌లోని యంగ్‌ స్టార్ సింగర్స్ ఇటీవల హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌ నుండి డైరక్ట్‌గా చిరంజీవి ఫామ్ హౌస్‌లో దిగారు. అక్కడ అప్పటికే వీరి కోసం అన్ని రకాల ఏర్పాట్లూ జరిగిపోయాయి. ఇక మొదలెట్టారు చూడండి.. గానా బజానా ఓ లెవల్‌లో జరిగింది. పాటలు రాయడం, ట్యూన్‌లు కట్టడం, పాడటం, మార్పులు చేయడం, మళ్లీ రాయడం, పాడటం.. ఇదే వరుస.

మామూలుగా అయితే టాలీవుడ్‌లో ఇలాంటి సంబరం చూసి ఉండరు. ఎందుకంటే మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో, ఫోన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. ఇలాంటి రోజుల్లో ఇలా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరగడం విశేషమే కదా. అయితే ఈ వీడియో రీసెంట్‌దేమీ లేదు. ఇటీవల జరిగింది, అక్కడకు వెళ్లిన ఓ గాయని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తే ఇప్పుడు వైరల్‌గా మారింది. మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో కీరవాణి (M. M. Keeravani) , రామజోగయ్య శాస్త్రితో (Ramajogayya Sastry) పాటు మరికొంతమంది యువ గాయనీగాయకలు ఉన్నారు.

రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj) , గోమతి అయ్యర్‌, షగున్‌, లోకేశ్వర్‌, అరుణ్‌ కౌండిన్య, శాండిల్య, హర్ష, భరత్‌, బాషా తదితర సింగర్స్‌ ఉన్నారు. లిప్సిక షేర్‌ చేసిన ఆ వీడియోలో కుర్రాళ్ల సందడి మామూలుగా ఉండదు. వారితో మధ్య మధ్యలో చిరంజీవి, కీరవాణి, రామ్‌జో కూడా ఉత్సాహంగా కనిపించారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోంది. ఆ మేరకు వేగంగా పనులు చేస్తున్నారు. అందులో ఇలాంటి ఓల్డ్‌ ట్రెడిషన్స్‌ కూడా ఫాలో అవుతుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus