మార్చి 21న ‘విశ్వామిత్ర’

సృష్టిలో ఏది జరుగుతుందో… ఏది జరగదో!? చెప్పడానికి మనుషులు ఎవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా ‘విశ్వామిత్ర’ చిత్రకథ అని దర్శకుడు రాజకిరణ్ అన్నారు. సృష్టికి, మనిషి ఊహకు ముడిపెడుతూ తీసిన ‘విశ్వామిత్ర’ చిత్రాన్ని మార్చి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆయన అన్నారు.

ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్., రాజకిరణ్ నిర్మిస్తున్న సినిమా ‘విశ్వామిత్ర’. నందితారాజ్, ‘సత్యం’ రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించారు. మార్చి 21న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఈ నెల 21న ట్రైలర్ విడుదల విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ “వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్ చిత్రమిది. న్యూజీలాండ్‌, అమెరికాలో నిజంగా జరిగిన కథలపై పరిశోధన చేసిన ఈ కథ రాసుకున్నా. నందితారాజ్ మధ్యతరగతి అమ్మాయి పాత్రలో కనిపిస్తారు” అన్నారు.ఈ చిత్రంలో అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్, విద్యుల్లేఖ రామన్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, పరుచూరి వెంకటేశ్వరరావు, జీవా, రాకెట్ రాఘవ, సి.వి.ఎల్ నరసింహారావు, ఇందు ఆనంద్ ముఖ్య తారాగణం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus