Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఫస్ట్ స్ట్రైట్ తెలుగు మూవీ ‘విశ్వనాథం అండ్ సన్స్'(Vishwanath & Sons). వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఇది. మామితా బైజు హీరోయిన్ గా తెరకెక్కుతుంది.

Vishwanath and Sons

‘సితార..’ నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్నాడు. అందువల్ల ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జూలై నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1:44 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘సంజయ్ విశ్వనాథ్ గతంలో ఎన్నో పిస్టోల్ కాంపిటీషన్స్ లో గెలిచారు. కానీ ఇప్పుడు వేరు. కంటిచూపుకి 20ల్లో ఉన్న ఫిట్నెస్ 40 దాటాక ఉండదు” వంటి డైలాగులతో టీజర్ మొదలైంది. ఆ డైలాగ్స్..తో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటన్నది తెలియజేశారు. మరోవైపు లావిష్ లైఫ్ బ్రతకాలి అనుకునే 20 ఏళ్ళ హీరోయిన్ మామితా బైజు.. 45 ఏళ్ళ మిడిల్ ఏజ్డ్ హీరోయిన్ ను ప్రేమించడం.

అందుకు హీరో ఒప్పుకోకపోవడం.. ఆ తర్వాత వీరి మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి? సూర్యకి బాబు ఎలా వచ్చాడు? వంటి ప్రశ్నలు లేవనెత్తుతు టీజర్ ను ఆసక్తికరంగా కట్ చేశారు. అయితే టైటిల్ కి కథకి సంబంధం ఏంటి? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కి హైలెట్ అని చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus