Waltair Veerayya Teaser: రచ్చ లేపుతున్న ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ టీజర్..!

మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యాన్స్ కి, తెలుగు ఆడియన్స్ కి సాలిడ్ దివాళీ ట్రీట్ ఇచ్చారు.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో, టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిలింకి సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. దీపావళి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. ఫెస్టివల్ సర్ ప్రైజ్ ఇచ్చారు మెగా 154 టీమ్.

పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత మందిస్తున్నాడు. చిరు నటిస్తున్న 154వ సినిమా ఇది. గతకొద్ది రోజులుగా ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ ప్రచారంలో ఉంది. అందరూ అనుకున్నట్టుగానే ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ పేరు ఫిక్స్ చేసేశారు. ఈ సందర్భంగా టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు.

‘ఏంట్రా.. వాడొస్తే పూనకాలన్నారు.. అడుగేస్తే అరాచకం అన్నారు.. సౌండే లేదు’ అని విలన్ అంటే.. చిరు ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది. చిరు ఒకప్పటి చిరులా అదే గ్రేస్, అదే ఈజ్ అండ్ ఎనర్జీతో కనిపించారు. మాస్ గెటప్ లో ఊరమాస్ స్టైల్లో బీడీ వెలిగించి.. ‘‘ఇలాంటి ఎంటర్ టైన్ మెంట్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే.. లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్ టు’’ అంటూ చిరు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

‘బాస్ ఈజ్ బ్యాక్’ అన్నట్టు చిరు సరికొత్త గెటప్ లో, ‘వాల్తేరు వీరయ్య‘ గా ఊరమాస్ అవతార్ లో కనిపించారు. ఆయన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ వంటివి ఈమధ్య కాలంలో మిస్ అయిన ప్రేక్షకాభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుందనిపిస్తోంది. మెగాభిమానులకు ఈ టైటిల్ టీజర్ తో పండుగ ఆనందం రెట్టింపయ్యింది.. ఇక టీజర్ చివర్లో మాస్ మహారాజా రవితేజ ‘‘హ్యాపీ దివాళీ.. తొందర్లోనే కలుద్దాం’’ అంటూ వాయిస్ వినిపించాడు. దేవి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో గూస్ బంప్స్ తెప్పించాడు. సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’ విడుదల కానుంది.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus