Bhola Shankar: భోళా శంకర్ సినిమాలో ఆ సీన్లకు గూస్ బంప్స్ గ్యారంటీ.. కానీ?

చిరంజీవి మెహర్ రమేష్ కాంబో మూవీ అయిన భోళా శంకర్ మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్లలో వేగం పుంజుకుంది. ఈ సినిమాకు బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. మెయిన్ థియేటర్లలో భోళా శంకర్ మూవీ ఫస్ట్ డే టికెట్లు దొరకడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ సభ్యులు నాలుగు మార్పులు సూచించారు.

ఈ సినిమా ఇంటర్వెల్ లో విలన్ తల నరికే సన్నివేశం ఉంటుందని సెన్సార్ సభ్యుల రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. వాల్తేరు వీరయ్య సినిమాలో సైతం ఇలాంటి సీన్ ఒకటి ఉంటుందనే సంగతి తెలిసిందే. భోళా శంకర్ మూవీ విషయంలో వాల్తేరు వీరయ్య సెంటిమెంట్ ను ఫాలో అవుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. మాస్ ఫ్యాన్స్ మెగాస్టార్ ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో ఈ సినిమా అదే విధంగా ఉండనుంది.

తమన్నా, కీర్తి సురేష్ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని తెలుస్తోంది. సినిమా నిర్మాణ విలువలు భారీ స్థాయిలో ఉన్నాయని సిస్టర్ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉందని సమాచారం అందుతోంది. భోళా శంకర్ సినిమా అద్భుతంగా ఉందని తెలుస్తోంది. శ్రీముఖి, రష్మీ సీన్లు సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఎమోషనల్ సీన్స్ లో కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉండనుంది.

ఈ సినిమా వేదాళం మూవీ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశారని ఈ సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఎక్కువగా ఉండనున్నాయని తెలుస్తోంది. భోళా శంకర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భోళా శంకర్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండనుందని తెలుస్తోంది. భోళా శంకర్ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus