Wamiqa Gabbi: క్లీవేజ్‌ షోలు… సెమీ న్యూడ్‌ సీన్లు… వామ్మో టూమచ్‌ హాట్‌ అంతే!

సుధీర్‌బాబు ‘భలే మంచి రోజు’ సినిమా చూశారా? ‘మామా మశ్చీంద్ర’ సినిమాతో ప్రస్తుతం థియేటర్లలో సుధీర్‌బాబు ఉంటే… పాత సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడ విషయం సుధీర్‌బాబు కాదులెండి… ఆ సినిమాలో హీరోయిన్‌. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన వామికా గబ్బి ఆ తర్వాత తెలుగులో పెద్దగా రాలేదు. అలాగే మిగిలిన భాషల్లో కూడా రాణించింది లేదు. అయితే ఈ క్రమంలో ఆమె వెబ్‌ సిరీస్‌లో నటించింది. మామూలుగా ఇలా హీరోయిన్లు వెబ్‌ సిరీస్‌ల ద్వారా ఓటీటీలకు రావడం ఇప్పుడు సాధారణమైపోయింది.

అందులోనూ సినిమాల్లో సరైన విజయం లేనివాళ్లు రావడం ఇంకా సర్వసాధారణం. అయితే ఇలా వచ్చినవాళ్లు స్కిన్‌ షో చేయడం ఈ మధ్య చూస్తున్నాం. తమన్నా లాంటి హీరోయినే ఏకంగా దశాబ్దంన్నరపాటు పాటించిన నో కిస్‌ రూల్‌ను, స్కిన్‌ షో రూల్‌ను బ్రేక్‌ చేసేసింది. అయితే ఇప్పుడు వామికా అంతకుమించిన పని చేసింది. ఇప్పుడు ఆమె (Wamiqa Gabbi) చేసిన పని వల్ల సోషల్‌ మీడియా మొత్తం వామికా నామ జపం చేస్తోంది.

ఇంత చెబుతున్నారు ఆ వెబ్‌ సిరీస్‌ పేరు చెప్పడం లేదు అనుకుంటున్నారా? అవును కదా ఆ సిరీస్‌ పేరు ‘కుఫియా’. ట‌బు, అలీ ఫ‌జ‌ల్ నటించిన ఈ సిరీస్‌లో వామికా సెమీ న్యూడ్ సీన్ల‌తో రెచ్చిపోయింది. ఓ సీన్‌ఓ ఒంటిపై బ‌ట్ట‌లు విప్పేస్తూ క్లీవేజ్ షోతో ఫైర్‌ పుట్టించేసింది. మ‌రో సీన్‌లో అయితే బెడ్ రూం సీన్ చేసింది. ఇప్పుడు ఆ రెండూ హాట్‌ టాపిక్కే. వెబ్ సిరీస్‌ల్లో నటీమణులు క్లీవేజ్ షోలు చేయ‌డం కొత్తేమీ కాదు. అలా అని పెద్ద విషయం కూడా కాదు.

కానీ సినిమాల్లో చేసి కాస్తో, కూస్తో పేరు తెచ్చుకున్న వామికా ఇలా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వామికా గురించి తెలియ‌ని వాళ్లు ఎవ‌రీ అమ్మాయి ఇంత హాట్‌గా ఉంది అంటూ ఆరాలు తీస్తున్నారు. తెలుగు వాళ్లయితే ఇలా అయిపోయిందేంటి సుధీర్‌ బాబు హీరోయిన్‌ అంటున్నారు. అన్నట్లు ఈ సిరీస్‌ ఎందులో వస్తుందో కూడా చెప్పలేదు కదా… నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోంది.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus