War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

10 ఏళ్ళుగా ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా తన ఫామ్ ను కాపాడుకుంటూ వచ్చాడు ఎన్టీఆర్. అయితే ఇటీవల వచ్చిన ‘వార్ 2’ నిరాశే మిగిల్చింది అని చెప్పాలి. ఎన్టీఆర్ బాలీవుడ్లో చేసిన స్ట్రైట్ మూవీ ఇది. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు. ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ వారి స్పై యూనివర్స్ లో ఆదిత్య చోప్రా రూపొందించిన ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.

War 2 Collections

ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. మొదటి వీకెండ్ వరకు మంచి ఓపెనింగ్స్ సాధించింది. తర్వాత బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. వారంలో ఈ సినిమా నిలబడలేకపోయింది. కొన్ని చోట్ల జీరో షేర్స్, ఇంకొన్ని చోట్ల ఒకటి, రెండు లక్షల షేర్స్ రాబడుతూ.. కిందా మీదా పడుతుంది. నిన్న వినాయక చవితి హాలిడేని సైతం క్యాష్ చేసుకోలేకపోయింది ‘వార్ 2’. ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 10.94 cr
సీడెడ్  8.08 cr
ఉత్తరాంధ్ర 5.37 cr
ఈస్ట్ 2.91 cr
వెస్ట్ 2.05 cr
గుంటూరు 3.43 cr
కృష్ణా 2.69 cr
నెల్లూరు 1.74 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 37.21 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.39 cr
ఓవర్సీస్ 2.75 cr
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) 43.35(షేర్)

 

‘వార్ 2’ చిత్రానికి (తెలుగు వెర్షన్) రూ.87.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.88 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.14 రోజుల్లో ఈ చిత్రం రూ.43.35 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.80.08 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.44.65 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus