War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

ఎన్టీఆర్.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘వార్ 2’. ఎన్టీఆర్ బాలీవుడ్లో చేసిన స్ట్రైట్ మూవీ ఇది.  ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ వారి స్పై యూనివర్స్ లో భాగంగా ఆదిత్య చోప్రా రూపొందించిన ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. మొదటి వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ వచ్చాయి.

War 2 Collections

కానీ తర్వాత తగ్గిపోయాయి. 2వ వీకెండ్,వినాయక చవితి వంటి హాలిడేస్ ను కూడా ఈ సినిమా అంతగా క్యాష్ చేసుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ సినిమాకి ఇంకో వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఈ ఆదివారంతో ‘వార్ 2’ రన్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి చేరుకున్నట్టే! ఒకసారి 17 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 11 cr
సీడెడ్  8.11 cr
ఉత్తరాంధ్ర 5.40 cr
ఈస్ట్ 2.91 cr
వెస్ట్ 2.06 cr
గుంటూరు 3.44 cr
కృష్ణా 2.69 cr
నెల్లూరు 1.75 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 37.36 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.39 cr
ఓవర్సీస్ 2.78 cr
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) 43.53(షేర్)

 

‘వార్ 2’ చిత్రానికి (తెలుగు వెర్షన్) రూ.87.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.88 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.17 రోజుల్లో ఈ చిత్రం రూ.43.53 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.80.38 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.44.47 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus