ట్విట్టర్ వేదికగా కొట్టుకుంటున్న అజిత్, విజయ్ ఫ్యాన్స్

తమిళ తంబీల అభిమానానికి హద్దులు ఉండవు. వాళ్ళు సినిమా తారలను దేవుళ్ళతో సమానంగా పూజిస్తారు. ఇప్పటికే కుష్బూ, నమిత వంటి తారలకు గుడులు కూడా కట్టేసిన చరిత్ర వారిది. తమ అభిమాన హీరోయిని ఎంతగా పూజిస్తారో, అదే స్థాయిలో సాటి హీరోలను ద్వేషించడం వీరికున్న చెడ్డ అలవాటు. ఇక థియేటర్స్ దగ్గర గొడవలు, హత్యాయత్నాలు వంటి కూడా జరిగాయంటే వీరి పైత్యం ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవచ్చు. కాగా కోలీవుడ్ హీరోలలో ఇద్దరు టాప్ స్టార్ ఫ్యాన్స్ మధ్య ఈ ధోరణి ఎక్కువగా ఉంది.

తలపతి విజయ్, తల అజిత్ మధ్య ఫ్యాన్ వార్ ఓ రేంజ్ లో నడుస్తుంది. వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య పచ్చి గడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. కాగా నేడు హీరో అజిత్ పుట్టిన రోజు కావడమతో ఎహ్ బి డి డియరెస్ట్ అజిత్ అనే యాష్ టాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. దానికి పోటీగా విజయ్ ఫ్యాన్స్ విజయ్ ది పేస్ ఆఫ్ కోలీవుడ్ పేరుతో ఓ యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ట్విట్టర్ లో అజిత్ మరియు విజయ్ ఫ్యాన్స్ పేజ్ కలిగిన హార్డ్ కోర్ అభిమానులు ఇదో పెద్ద యుద్ధంలా , ఉద్యమంలా ముందుకు తీసుకెళుతున్నారు. ఈ రెండు యాష్ ట్యాగ్స్ లో ఏది టాప్ ట్రెండింగ్ లో ఉంటే వారు విన్ అయినట్లు వారు భావిస్తున్నారు. ఈ రోజు మొత్తం ఈ ట్విట్టర్ వార్ నడవనుంది. ఇక విజయ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేసిన మాస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో అజిత్ హెచ్ వినోత్ దర్శకత్వంలో వాలిమై సినిమాలో నటిస్తుండగా చిత్రీకరణ దశలో ఉంది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus