ఈ సంక్రాంతికి మహేష్ – అల్లు అర్జున్ మధ్య హోరా హోరి పోరు నడిచింది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాలు ఒక రోజు వ్యవధిలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. రెండు చిత్రాలు పోటాపోటీగా వసూళ్లు సాధించాయి. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించింది. ఇక త్రివిక్రమ్ – బన్నీ ల హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో సైతం బన్నీ కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలవడంతో పాటు టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో మూడవ స్థానం ఆక్రమించింది.
మహేష్, బన్నీల మధ్య సంక్రాంతి వార్ ఎప్పుడు, ఎవ్వరూ చూడని రీతిలో సాగింది. కాగా బన్నీ ఈసారి ఎన్టీఆర్ తో పోటీపడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ తన 30వ చిత్రం త్రివిక్రమ్ తో కమిటైన సంగతి తెలిసిందే. కొద్దిరోజులు క్రితం ఈ మూవీపై అధికారిక ప్రకటన చేశారు. మే నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 2021 ఏఫ్రిల్ లో విడుదల చేయనున్నట్లు చెప్పడం జరిగింది. బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కూడా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని ప్రణాళికలు వేస్తున్నారట.
నిజానికి బన్నీ, 2020 చివర్లో లేదా, 2021 జనవరి కి రావాలని అనుకున్నారు. ఐతే కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటి వరకు కేవలం ఒక షెడ్యూల్ పూర్తి చేయగా, అది కూడా బన్నీ లేకుండా పూర్తి చేశారు. దీనితో ఈ చిత్రాన్ని నెక్స్ట్ సమ్మర్ కి విడుదల చేయాలని భావిస్తున్నారట. అది కూడా ఏప్రిల్ అని తెలుస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్, బన్నీకి మధ్య పోరు తప్పేలా కనిపించడం లేదు. ఒక వేళ అదే కనుక నిజం అయితే సమ్మర్ కి ఇద్దరు టాప్ స్టార్స్ మధ్య రసవత్తర పోరు నడవడం ఖాయం.