వెంకటేష్ ఇంట పెళ్ళి సందడి షురూ..!

ఈ సంవత్సరం ఆరంభంలోనే ‘ఎఫ్2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలో పెళ్ళి హడావిడి మొదలుకాబోతుంది. విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్ళి పీట‌లెక్క‌బోతుందట. ఫిబ్రవరి 6న ఈమె నిశ్చితార్థ వేడుక కూడా జరిగిపోయింది. బంధువులు సన్నిహితుల మధ్య ఈ వేడుకను చాలా సింపుల్ గా నిర్వహించినట్టు తెలుస్తుంది.

గత కొంత కాలంగా ఆశ్రీత హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో ప్రేమలో ఉందట..! తాజాగా వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పెద్దలు కూడా వివాహానికి అంగీకరించేశారట. తాజాగా వెంకటేష్ అన్నయ్య అయిన సురేష్ బాబు తో కలిసి… సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పెళ్ళి ఖాయం చేసుకున్నారని దగ్గుబాటి సన్నిహితుల సమాచారం. పెళ్ళికొడుకు తండ్రి రఘురామి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడు కావడంతో ఈ వివాహానికి పెద్దల అంగీకరించినట్టు స్పష్టమవుతుంది. ఇక మార్చి 1న అశ్రిత పెళ్ళి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చక చకా జరిగిపోతున్నాయట. మంచి ముహూర్తం చూసుకుని… ఇరు కుటుంబాలు ఈ పెళ్ళి కబురుని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. రీల్ లైఫ్ లో ఎన్నో ప్రేమ కథా చిత్రాలలో నటించిన వెంకటేష్.. ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా ప్రేమ వివాహానికి అంగీకరించడం విశేషం. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus