పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. దిల్ రాజు (Dil Raju) తమ్ముడి కొడుకు ఆశిష్ (Ashish Reddy) , నితిన్ (Nithiin) ‘ఎక్స్ట్రా’ (Extra: Ordinary Man) సినిమాలో విలన్ గా చేసిన సుదేవ్ నాయర్(Sudhev Nair) ,స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), సీనియర్ హీరోయిన్ అక్ష (Aksha Pardasany), బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ (Vasanthi Krishnan), మీరా చోప్రా(Meera Chopra).. వంటి వారు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి ఎంట్రీ ఇచ్చారు.మరో స్టార్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కి (Varalaxmi Sarathkumar) కూడా ఎంగేజ్మెంట్ జరిగింది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కూడా హీరోయిన్ రహస్యతో (Rahasya Gorak) ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే సింగర్ హారికా నారాయణ్ (Harika Narayan) వంటి టెక్నీషియన్స్ కూడా పెళ్లిపీటలెక్కారు. ఇక నెక్స్ట్ ఈ లిస్ట్ లో ఉంది తమన్నానే..! చాలా కాలంగా తమన్నా (Tamannaah).. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో (Vijay Varma) ప్రేమలో ఉంది.అంతేకాదు ప్రస్తుతం వీళ్ళిద్దరూ లివ్ ఇన్లో కూడా ఉన్నారు అని పలు ఫోటోల ద్వారా స్పష్టం చేస్తూనే ఉన్నారు.
ఇక త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇండియాలోనే వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతుందట. ఆల్రెడీ ఆ ప్లేస్ కోసం అన్వేషించడం మొదలుపెట్టింది ఈ జంట అంటూ ఇన్సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే డేట్ మాత్రం ఇంకా రివీల్ కాలేదు. కానీ కచ్చితంగా రాబోయే రెండు నెలల్లో వీరి పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక తమన్నా- విజయ్ వర్మ..లు కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ లో నటించిన సంగతి తెలిసిందే.
విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?