నితిన్ పూర్తిగా మారిపోయాడు!!!

సహజంగా విజయం ధైర్యాన్ని ఇవ్వాలి. కానీ అదే విజయం కొందరికి గర్వాన్ని కూడా ఇస్తుంది. అదంతా పక్కన పెడితే నితిన్ హీరోగా అందాల భామ సమంత హీరోయిన్ గా మన టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసిన ‘అ…ఆ’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా దాదాపుగా 50కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే అంతటి ఘనవిజయాన్ని అందుకున్న తరువాత నితిన్ మారిపోయాడని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

అసలేం జరిగింది అంటే….సూపర్ సక్సెస్ సినిమా తరువాత సినిమాను ఎంచుకోవడంలోనే కాదు, పారితోషకం విషయంలో కూడా నితిన్ దర్సకనిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు అని టాక్. తనకు కధలు చెప్పడానికి వస్తున్న దర్శకులకు వారు చెపుతున్న కధల విషయంలో రకరకాల సూచనలు చేస్తూ చాలా మంది దర్శకుల ఉత్సాహాన్ని నీరు ఇండస్ట్రీలో చర్చించుకోవడం విశేషం. అదే క్రమంలో ‘అ…ఆ’ సినిమా అంతటి ఘన విజయాన్ని సాధించినా నితిన్ వద్దకు ఏ బడా దర్శకుడు రాకపోవడం నితిన్ కి అస్సలు మింగుడు పడటంలేదు.

ఇక మరో పక్క వరుస డిజాస్టర్స్ తో మునిగిపోయిన నితిన్ కు ‘గుండె జారి గల్లంతైందే’ లాంటి సూపర్ హిట్ మూవీని అందించిన కొండా విజయ్ కుమార్ సైతం కధ చెప్పగా అతన్ని సైతం పక్కన పెట్టి బడా దర్శకుల వైపు చూస్తున్నాడు నితిన్. ఏది ఏమైనా…అ..ఆ సక్సెస్ నితిన్ ను పూర్తిగా మార్చి వేసింది అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus