Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

అఖిల్‌కి హిట్‌ కావాలి.. అఖిల్‌కి హిట్‌ బొమ్మ పడాలి.. అఖిల్‌కి సరైన విజయం దక్కాలి.. ‘లెనిన్‌’ సినిమా విడుదలకు ముందు అంతా ఇలానే అనుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలోకి వచ్చినా సరైన విజయం దక్కకపోవడంతో ఆ వైబ్‌ సినిమాకు బాగా పనికొచ్చింది. అనుకున్నట్లుగానే సినిమాకు మంచి టాక్‌ వచ్చింది, వసూళ్లు కూడా వచ్చాయి. ఎప్పటి నుండో అఖిల్‌ వెయిట్‌ చేస్తున్న విజయం వచ్చేసింది. అయితే ఆ సినిమా తర్వాత ఇంకా ఏ ప్రాజెక్టూ అనౌన్స్‌ చేయలేదు.

Akhil Akkineni

‘లెనిన్‌’ సినిమా రిలీజ్‌ తర్వాత అఖిల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా తనలో వచ్చిన మార్పు గురించి స్పష్టంగా చెప్పాడు. నెక్స్ట్‌ చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని కూడా చెప్పాడు. అయితే ఆ సినిమా వచ్చి నాలుగు నెలలు అయినా ఇంకా కొత్త సినిమా అనౌన్స్‌ కాలేదు. అఖిల్‌కి ఓ రచయిత కథ చెప్పారని కానీ, డైరక్టర్‌ కథ చెప్పారు అని కానీ ఎక్కడా లీకులు కూడా రావడం లేదు. దీంతో అసలు ఏం జరుగుతోంది అనే చర్చ జోరుగా జరుగుతోంది.

నిజానికి అక్కినేని హీరోల సినిమాల విషయంలో ఓ కాన్సెప్ట్ రన్‌ అవుతుంటుంది. అక్కినేని హీరోలకు ఎవరైనా కథ చెప్పినప్పుడు.. అది కాస్త ఓకే అనుకున్నా.. ఆ దర్శకుడు కొన్ని నెలల పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఉండి కథను తన టీమ్‌తో కలసి పూర్తి స్థాయిలో రెడీ చేస్తారు. ఫైనల్‌ వెర్షన్‌ విని ఓకే అనుకుంటే సినిమా ముందుకెళ్తుంది. లేదంటే ఆ దర్శకుడు వేరే హీరోను చూసుకోవడమే. ఇప్పుడు అఖిల్‌ విషయంలోనూ అదే జరుగుతోందని టాక్‌.

అలా ఇద్దరు అగ్ర దర్శకులు, ఇద్దరు యువ దర్శకులు అన్నపూర్ణ స్టూడియోస్‌లో కథ విషయంలోనే కుస్తీలు పడుతున్నారట. ఈ విషయంలో క్లారిటీ వస్తే సినిమా అనౌన్స్‌మెంట్‌ వస్తుంది అని చెబుతున్నారు. ఏదేమైనా మోస్ట్‌ వెయిటింగ్‌ హిట్‌ వచ్చాక కూడా ఇలా నాలుగైదు నెలలు ఖాళీగా ఉండటం సరికాదు..

ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus