2019 జూలై సెంటిమెంట్ ఎలా ఉంటుందో?

  • June 29, 2019 / 11:03 AM IST

సంక్రాంతి, సమ్మర్ సీజన్లలో విడుదలైన సినిమాలకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా పెద్ద విజయాలు నమోదు చేస్తాయి అనడంలో సందేహం లేదు. ఇక ఈ 2019 సంక్రాంతికి ‘ఎఫ్2’ చిత్రం పెద్ద హిట్టయ్యింది. ఇక సమ్మర్ కి ‘మజిలీ’ ‘కాంచన 3’ ‘జెర్సీ’ ‘మహర్షి’ వంటి చిత్రాలు కూడా హిట్టయ్యాయి. అయితే గత ఐదేళ్ళుగా జూలైలో విడుదలైన చిత్ర్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలుస్తుండడం విశేషం. 2014 నుండీ జూలై సెంటిమెంట్ మొదలైంది. 2018 వరకూ ఈ సెంటిమెంట్ కొనసాగుతూనే వచ్చింది. మరి ఈ 2019 జూలై ఎలా ఉంటుందా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

2014 లో జులై లో విడుదలైన ‘దృశ్యం’, 2015 జులై లో ‘బాహుబలి ది బిగినింగ్’ , 2016 జులై లో ‘పెళ్ళిచూపులు’, 2017 జులై లో ‘ఫిదా’, ఇక 2018 జులై లో ‘ఆర్.ఎక్స్.100’… ఈ చిత్రాలన్నీ ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఇక 2019 జులై లో కూడా ‘ఓ బేబీ’ ‘దొరసాని’ ‘ఇస్మార్ట్ శంకర్’ ‘రాక్షసుడు’ ‘డియర్ కామ్రేడ్’ వంటి క్రేజీ చిత్రాలు విడుదలవుతున్నాయి. మరి 2019 జులై లో విడుదలవుతున్న ఈ చిత్రాల్లో ఏ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus